ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ న్యూస్ మొత్తం చదవండి. ప్రభాస్, రాజమౌళి కాంబినేష్‌లో చాలా భారీ ఎత్తున నిర్మాణం జరుపుకుంటున్న ‘బాహుబలి’ చిత్రం అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చెయ్యబోతున్నట్టు దర్శకనిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇదంతా బాగానే వుంది కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఇప్పటివరకు అనుష్క హీరోయిన్ అని మొదటి నుంచీ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అనుష్క ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్‌లో వుండదట. ఫస్ట్ పార్ట్‌లో తమన్నా ప్రభాస్ సరసన అవంతికగా కనిపిస్తుందని సమాచారం. అనుష్కతో చేసిన సీన్స్ అన్నీ సెకండ్ పార్ట్‌లో వున్నాయని తెలిసింది. ‘బాహుబలి’గా ప్రభాస్‌ని చూడాలని ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో, దేవసేనగా అనుష్క పెర్‌ఫార్మెన్స్‌ను, గ్లామర్‌ను చూడాలని అంతే ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి అనుష్క ‘బాహుబలి’ మొదటి భాగంలో వుండదన్న విషయాన్ని ఆడియన్స్ ఏవిధంగా డైజెస్ట్ చేసుకుంటారో, ఎంతగా మధనపడతారో చూడాలి మరి.