Advertisementt

చిత్ర నిర్మాణ రంగంలోకి నారా రోహిత్‌

Thu 29th Jan 2015 01:10 PM
hero nara rohith,nara rohith as producer,nara rohith movies  చిత్ర నిర్మాణ రంగంలోకి నారా రోహిత్‌
చిత్ర నిర్మాణ రంగంలోకి నారా రోహిత్‌
Advertisement
Ads by CJ

‘బాణం’ చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోగా తెరంగేట్రం చేసిన యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో నారా రోహిత్‌. తొలి చిత్రంతోనే డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో సక్సెస్‌ సాధించి ఆ తర్వాత ‘సోలో, ప్రతినిధి, రౌడీఫెలో’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ  ఓ సెపరేట్‌ స్టైల్‌ ను క్రియేట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం  ‘పండగలా వచ్చాడు, అసుర’ చిత్రాలతో బిజీగా వున్న నారా రోహిత్‌ చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంటర్‌ అవుతున్నారు. ఇటీవల నూతన దర్శకుడు శ్రీ సతీష్‌ దేవినేని నారా రోహిత్‌ని కలిసి ఓ సబ్జెక్ట్‌ని చెప్పటంతో.. ఆ కథ నారా రోహిత్‌కి చాలా బాగా నచ్చి ఎక్సైటింగ్‌గా వుండటంతో పాటు, యూత్‌, ఫ్యామిలీ, క్లాస్‌, మాస్‌తో సహా అన్ని వర్గాల వారిని అలరించే యూనివర్సల్‌ అప్పీల్‌ వున్న సబ్జెక్ట్‌ కావడంతో ఇటువంటి కథని తనే స్వయంగా నిర్మిస్తే ఆ కథకి పూర్తి న్యాయం చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్‌తో ఆరన్‌ మీడియా పతాకంపై శ్రీ సతీష్‌ దేవినేని దర్శకత్వంలో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.  ఎప్పటికప్పుడు యంగ్‌ టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ కొత్తదనం కోసం తపించే నారా రోహిత్‌ సినిమా నిర్మాణ రంగంలోనూ తనదైన శైలిలో డిఫరెంట్‌ సినిమాలు నిర్మించనున్నారు. ఈ  సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ వివరాలను త్వరలోనే వెల్లడిరచనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ