సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తోన్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది.
సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ...ఈ సినిమా నా కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది.మంచి కధ,కధనాలతో టాలెంటెడ్ టీమ్ తో ఈ సినిమా తెరకెక్కుతుందన్నారు..
శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో పెద్ద సినిమాలు నా వద్దకు వచ్చినా .. దర్శకుడు సుదర్శన్ చెప్పిన కదకదనాలు నాకు నచ్చి ఈ సినిమా చెస్తున్నాను.టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..
దర్శకుడు మాట్లాడుతూ.. సెప్టెంబర్లో చిత్రీకరణ ప్రారంబించాం.. ఇప్పటికి అరవై శాతం సినిమా కంప్లీట్ అయింది.జనవరి 29నుంచి తదుపరి షెడ్యూల్ ను ప్రారంబిస్తున్నాము.ఫిబ్రవరి నెలాఖరు వరకు కంటిన్యూస్ గా షూటింగ్ చెస్తాం.దీంతో టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది.కాంటెపరరీ ఇష్యూస్తొ పాటు,ఫీల్గుడ్ లవ్ స్టోరీ ఈ సినిమాకు ప్రదానాకర్షణగా నిలుస్తుందన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... అన్ని వర్గాల వారిని అలరించెలా ఈ సినిమా తెరకెక్కుతుందన్నారు.
రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ ,సప్తగిరి, ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు
కెమెరా: సిద్దార్ద్.. సంగీతం: మహత్.