యంగ్ హీరో సందీప్‌కిషన్ క్యూట్ గర్ల్ సురభి జంటగా కన్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్ ఫిలింస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన చిత్రం ‘బీరువా’. ఈ చిత్రం జనవరి 23న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దిగ్విజయంగా రన్ అవుతోంది. ఈ చిత్రం సాధిస్తోన్న ఘన విజయంపై ప్రేక్షకులకు థాంక్స్ తెలియజేయడానికి చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని మూసాపేట లక్ష్మికళ, కూకట్‌పల్లి అర్జున్ థియేటర్స్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్‌కిషన్, ప్రముఖ నటుడు నరేష్, కెమెరామెన్ ఛోటా కె. నాయుడు, నిర్మాత జెమిని కిరణ్, హాస్యనటుడు శకలక శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ నటుడు నరేష్ మాట్లాడుతూ ‘‘ఎక్కడ చూసినా మా ‘బీరువా’ నిండా చప్పట్లు, హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు. యూత్ మాత్రమే కాకుండా పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. షో షోకి కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇంకా ఈ చిత్రాన్ని చూసి పెద్ద హిట్ చేయాలి. సినిమా నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి. ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తీశారు మా నిర్మాతలు రామోజీరావు గారు, కిరణ్ గారు ఈ ‘బీరువా’నిండా మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో సందీప్‌కిషన్ మాట్లాడుతూ ‘‘ఒక మంచి కథని జెన్యూన్‌గా నమ్మి ‘బీరువా’ సినిమా తీశాం. సినిమా మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, చుట్టూ వున్న వారికి ఈ సినిమా చూడమని చెప్పండి. నచ్చకపోతే చెప్పొద్దు. మనలాంటి వాళ్లు అందరికీ నచ్చరు. చూడగా చూడగా నచ్చుతారు. అలాగే ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని జెన్యూన్ హిట్‌చేసిన ప్రేక్షకులందరికీ నా థాంక్స్. కూకట్‌పల్లిలోని ప్రేక్షకులు మంచి సినిమా ఏది వచ్చినా ఆదరిస్తారు. సినిమా అంటే వాళ్లందరికీ ఇష్టం. ఎంతో మంది షార్ట్ ఫిలింస్ తీస్తున్నారు. డైరెక్టర్స్‌గా, హీరోలుగా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తేనే ఎంతోమంది సందీప్‌కిషన్‌లు ఇండస్ట్రీకి రాగలుగుతారు. ఈ సినిమా చూసి నచ్చితే ఇంకో పది మందికి ఈ సినిమా చూడమని చెప్పండి. ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మా కిరణ్‌గారు మంచి సినిమా తీశారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కి నా థాంక్స్’’ అన్నారు.
కమెడియన్ శంకర్ మాట్లాడుతూ ‘‘బీరువా’ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్’’ అన్నారు.