బుల్లితెర హీరోయిన్ సుమకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఆమె కుటుంబానికి సంబంధించిన ఓ ప్లాట్ కబ్జాకు గురైంది. అసలు విషయానికి వెళితే.. సుమ మామగారైన దేవదాస్ కనకాల పేరుపై హయత్‌నగర్‌లో ఓ ప్లాట్ ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం ఆ ప్లాట్ వద్దకు వెళ్లిన దేవదాస్ కనకాల, ఆయన కుమారుడు రాజీవ్ కనకాల అక్కడ నిర్మాణాలు కొనసాగుతుండటంపై షాక్‌కు గురయ్యారు. ఇది తమకు సంబంధించిన ప్లాట్ అని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పినా అక్కడి వారు వినిపించుకోలేదట. ఇక చేసేది లేక వారిద్దరూ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఇక బుల్లితెరపై తన మెస్మరైజింగ్ యాంకరింగ్‌తో అందర్ని మెప్పించే సుమకు మరి పోలీసులు ఎంతవరకు న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే..!