బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనె. గత రెండేళ్ళగా అత్యధిక హిట్లు నమోదు చేసుకున్న నాయికల్లో దీపిక ఒకరు. బాలీవుడ్ బాక్సాఫీస్‌కు చిరునామాగా మారి ఆమె నటించిన సినిమాలన్నీ వంద కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తున్నాయి. గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది కూడా ముచ్చటగా మూడు సినిమాలతో అలరించనుంది. మూడూ భారీ చిత్రాలే కావడం విశేషం. ప్రస్తుతం ‘పీకు’, ‘తమాషా’, ‘బాజీరావ్ మస్తానీ’ సినిమాలు చేస్తోంది. పీకు షూటింగ్ శర వేగంగా జరుగుతుండగా మరో పక్క ‘తమాషా’ సినిమా కూడా జరుగుతుంది. అయితే పీకు షూటింగ్ అయిన వెంటనే ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా షూటింగ్‌కు పరుగు తియ్యాల్సి వస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దగుమ్మ ఉరుకులు, పరుగుల మధ్య జీవితాన్ని సాగిస్తోంది. అయినప్పటికీ ఎంతో యాక్టివ్‌గా షూటింగ్‌లో పాల్గొంటుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యతిస్తూ కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడుపుతోంది. ఈ వారంలో ‘తమాషా’ సినిమా తదుపరి షెడ్యూల్ డిల్లీలో ప్రారంభంకానుండడంతో దీపికా మరింత బిజీకానుంది.