నాకు నైస్ బాయ్స్ అంటే ఇష్టం ఉండదు. బ్యాడ్ బాయ్స్‌నే ఇష్టపడతాను. ఎందుకనేది సమయం వచ్చినప్పుడు చెబుతాను అని బబ్లీగర్ల్ ఆలియాభట్ అంటోంది. గతేడాది ‘టూ స్టేట్స్’, ‘హైవే’, ‘హమ్టీ శర్మాకి దుల్హానియా’ సినిమాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘షాన్‌దార్’ సినిమాతో బిజీగా ఉంది. ఆలియా చెబుతూ...
‘‘నాకు ఫంకీగా ఉండే అబ్బాయిలంటే చాలా ఇష్టం. హృతిక్‌రోషన్ అంటే ఇష్టం. ఆయనతో నాటీగా, చిలిపిగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన సింగిల్‌గా ఉన్నారు కదా. నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి’’ అని చెప్పుకొచ్చింది. 22 ఏళ్ళ ఆలియా తనకంటే వయసులో చాలా పెద్ద వాడైన హృతిక్‌తో నాటీగా ఉండాలనుకోవడానికి కారణమేంటనేది తెలియాల్సి ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.