‘‘అవార్డ్‌లనేవి మనం అనుకుంటే వచ్చేవి కావు. అందుకు భగవంతుడి ఆశీస్సులుండాలి. నటుడిగా సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ అవార్డ్‌ను ప్రకటించడం ఆనందంగానూ, ఎంతో సంతృప్తిగానూ ఉంది’’ అని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డ్‌ను ప్రకటించింది. ఆయన స్పందిస్తూ... నాటకాల నుండి సినిమాలోకి వచ్చాను. స్వయంకృషితో అంచెలంచెలుగా నటుడిగా ఎదిగాను. మొదట్నుంచీ నాకు విభిన్నమైనా వేషాలిస్తూ దర్శకనిర్మాతలు ప్రోత్సాహించారు. వీటన్నిటితోపాటు స్వయంకృషి ఫలితంగా ఈ అవార్డ్ వచ్చింది. నాకు ఈ అవార్డ్ రావాలని ఎందరో కోరుకున్నారు. తప్పకుండా వస్తుందని కొందరు ఆశీర్వదించారు. అందరి కోరిక ఫలించింది’’ అని తెలిపారు.