Advertisementt

జైసాల్మీర్‌లో ‘కిక్‌-2’ క్లైమాక్స్‌ పూర్తి

Sun 25th Jan 2015 07:00 AM
telugu movie kick 2,kick 2 movie climax complete  జైసాల్మీర్‌లో  ‘కిక్‌-2’ క్లైమాక్స్‌ పూర్తి
జైసాల్మీర్‌లో ‘కిక్‌-2’ క్లైమాక్స్‌ పూర్తి
Advertisement
Ads by CJ

మాస్‌ మహారాజా రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్‌’ ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ కిక్‌ టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ‘కిక్‌-2’ క్లైమాక్స్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన ‘పటాస్‌’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా బ్లాక్‌బస్టర్‌ సాధించిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ తమ బేనర్‌లో చేస్తున్న ‘కిక్‌-2’ చిత్రాన్ని చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌ చిత్రీకరణ రాజస్థాన్‌లోని జైసాల్మీర్‌లో భారీ లెవల్‌లో చిత్రీకరించడం జరిగింది. నెక్స్‌ట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌. మాస్‌ మహారాజా రవితేజ పుట్టినరోజు జనవరి 26. ఈ సందర్భంగా రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘కిక్‌-2’ ఫస్ట్‌ లుక్‌ మరియు టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌’కి సీక్వెల్‌ కాదుగానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇచ్చే సినిమా అవుతుంది. ‘కిక్‌’లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్ళిద్దరి కొడుకు కథే ‘కిక్‌`2’’ అన్నారు.

నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత మా సురేందర్‌రెడ్డితో రవితేజ హీరోగా చేస్తున్న సినిమా ఇది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు. 

మాస్‌ మహారాజా రవితేజ సరసన రకుల్‌ప్రీత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సురేందర్‌రెడ్డి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ