Advertisementt

'దాన వీర శూర కర్ణ' సినిమా ప్రారంభం..!

Fri 23rd Jan 2015 06:28 AM
dana veera soora karna,master ntr,balaraju,venkateswararao  'దాన వీర శూర కర్ణ' సినిమా ప్రారంభం..!
'దాన వీర శూర కర్ణ' సినిమా ప్రారంభం..!
Advertisement
Ads by CJ

నందమూరి మూడో తరం నటవారసులు 'మాస్టర్' ఎన్టీఆర్, సౌమిత్రులను వెండి తెరకు పరిచయం చేస్తూ శ్రీ సాయి జగపతి పిక్చర్స్ మరియు సంతోష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా బాల నటీనటులతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'దాన వీర శూర కర్ణ'. జె.వి.ఆర్. దర్శకుడు. సి.హెచ్.వెంకటేశ్వరరావు, జె.బాలరాజు నిర్మాతలు. ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా కళ్యాణ్ రామ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తొలి సన్నివేశానికి హరికృష్ణ గారు గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాతల్లో ఒకరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ''చిన్నపిల్లలతో పౌరాణిక సినిమా తీయాలన్న నా కోరిక నెరవేరబోతున్నందుకు, అందులో మాస్టర్ ఎన్టీఆర్ నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం కోసం ఇరురాష్ట్రాలలో బాలబాలికలను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించాం" అని తెలిపారు.

మరో నిర్మాత జె.బాలరాజు మాట్లాడుతూ ''ఒకప్పటి దాన వీర శూర కర్ణ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పేరు పోగొట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. జనవరి 23 నుండి 90 రోజుల పాటు షూటింగ్ జరుపుకొని, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే నెల 28 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.

దర్శకుడు జె.వి.ఆర్. మాట్లాడుతూ "ఇలాంటి సినిమాను బాల నటీనటులతో చేయడం సాహస కార్యం. ఈ చిత్రంలో నటించిన బాలలలో కొంత మందికి మంచి భవిష్యతు ఉంటుంది. ఎమ్మెస్ రెడ్డి గారు తీసిన బాల రామాయణాన్ని స్పూర్తిగా తీసుకొని ఈ సినిమా తీసాం"అని చెప్పారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎన్.సుధాకర్ రెడ్డి, సంగీతం: కౌసల్య, కళ: ఎస్.ఆర్.కె.శర్మ, ఎడిటర్: నందమూరి హరి, పోరాటాలు: డ్రాగన్ ప్రకాష్, మేకప్: సి.మాధవరావు, పాటలు: 'గంగోత్రి' విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, నృత్యాలు: ప్రమీల, రమణ.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ