Advertisementt

అందుకే ఆ పాట చేశానంటున్న శ్వేతాబసు

Thu 22nd Jan 2015 08:14 AM
telugu movie intelligent idiots on 23 jan  అందుకే ఆ పాట చేశానంటున్న శ్వేతాబసు
అందుకే ఆ పాట చేశానంటున్న శ్వేతాబసు
Advertisement
Ads by CJ

విక్రమ్‌ శేఖర్‌, ప్రభ్‌జీత్‌ కౌర్‌ జంటగా స్పైసీ క్రియేషన్స్‌, శ్రీ చెజెర్లమ్మ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై బాలాజీ దర్శకత్వంలో శరద్‌మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇంటలిజెంట్‌ ఇడియట్స్‌’. శ్వేతాబసు ప్రసాద్‌ ఈ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుంది. ఈ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్వేతా బసు ప్రసాద్‌, హీరో విక్రమ్‌శేఖర్‌, నిర్మాతలు శరద్‌మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు దంపూరి, దర్శకుడు బాలాజీ పాల్గొన్నారు. 

శ్వేతాబసు ప్రసాద్‌: ఈ చిత్రంలో నేను స్పెషల్‌ సాంగ్‌ చేశాను. నటిగా అన్నిరకాల పాత్రలు చేయాలన్నది నా అభిప్రాయం. అందుకే ఈసినిమాలో పాట చేశాను. పాట చాలా బాగా వచ్చింది. ఒక మంచి టీమ్‌తో వర్క్‌ చేసినందుకు చాలా ఆనందంగా వుంది. నేను రూట్స్‌ పేరుతో ఓ డాక్యుమెంటరీ చేస్తున్నాను. అది ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో వుంది. మూడు సంవత్సరాలుగా ఎంతో డెడికేషన్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌ అది. బాలీవుడ్‌లో నేను చేయబోయే కొన్ని సినిమాలు డిస్కషన్స్‌ స్టేజ్‌లో వున్నాయి. 

బాలాజీ: సినిమా విజయం మీద చాలా కాన్ఫిడెన్స్‌ వున్నాం. చక్కని కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా బాగా రావడానికి నిర్మాతలు అందించిన ప్రోత్సాహం మర్చిపోలేనిది. ఈ సినిమా విజయం సాధించి మా అందరికీ పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. 

నిర్మాతలు: యూత్‌ని టార్గెట్‌ చేస్తూ చేసిన సినిమా అయినప్పటికీ అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించడం జరిగింది. 23న మా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ