యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మిత్రులు బాహుబలి సినిమా తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారు. మిర్చి నిర్మాణ సంస్థ అధినేతలు ప్రమోద్, వంశిలు.. బాహుబలి సినిమాను తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి విడుదల చేయనున్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఎక్కువ రేటు పెట్టి కొన్నట్టు సమాచారం. విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఇప్పటికే పలు ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను నిర్మాతలు అమ్మేశారు అంటే బాహుబలిపై క్రేజ్ ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చారిత్రాత్మక సినిమాలో రానా విలన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. అనుష్క, తమన్నా హీరోయిన్‌లు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ఈ భారి బడ్జెట్ సినిమాను నిర్మిస్తుంది.