టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో మంచు మనోజ్ కూడా ఒకరు. ఆ ట్యాగ్ తొలగిపోయే రోజు ముందే ఉంది. అవును అది నిజం. మనోజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మనోజ్ కి పెళ్లి కుదిరిందనే వార్త మంగళవారం ఫిలిం నగర్లో హల్చల్ చేసింది. బిట్స్ పిలానిలో చదువు పూర్తి చేసిన ప్రణీత రెడ్డి, మనోజ్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటూన్నారని వినికిడి. ఇటీవలే రెండు కుటుంభాలు కూర్చొని చర్చించు కున్నారని, త్వరలోనే మనోజ్ కి, ప్రణీత రెడ్డికి నిశ్చితార్ధం జరగనుందని తెలిసింది. బయట వినబడుతున్న వార్తల్లో ఎంత నిజం ఉంది, అసలు ఏం జరగబోతుంది అనే విషయాన్నీ గురువారం మోహన్ బాబు తెలిజేయనున్నారు.
ఐతే మనోజ్ మాత్రం మంచి హిట్ పడిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.