Advertisementt

25న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ఆడియో

Tue 20th Jan 2015 07:37 AM
telugu movie krishnamma kalipindi iddarini audio on 25th jan  25న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ఆడియో
25న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ఆడియో
Advertisement
Ads by CJ

ఎవడిగోల వాడిది చిత్రంతో ప్రారంభమైన రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ బేనర్‌పై స్టైల్‌, వియ్యాలవారి కయ్యాలు, పోటుగాడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి ఉత్తమాభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు లగడపాటి శ్రీధర్‌. ఈ సంస్థ చిత్ర నిర్మాణం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సంస్థ తాజాగా నిర్మిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ చిత్ర విశేషాలను తెలియజేశారు. సుధీర్‌బాబు, నందిత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ఎల్‌.వి.రామానాయుడు సమర్పణలో శ్రీమతి లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ...

‘‘మా బేనర్‌లో వచ్చిన మొదటి సినిమా ఎవడిగోల వాడిది సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌ జరుపుకుంది. ఆ సినిమా తర్వాత కొన్ని మంచి చిత్రాలు చేసి వరస విజయాలు అందుకున్నాము. అదే ఉత్సాహంతో కన్నడంలో సూపర్‌హిట్‌ అయిన ఛార్మినార్‌ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నాం. డైరెక్టర్‌ చంద్రు ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈనెల 25న ఈ చిత్రం ఆడియోను విజయవాడలో రిలీజ్‌ చేయబోతున్నాం. ఇప్పటికే ఈ ఆడియోకి సంబంధించిన ఐ రింగ్‌టోన్స్‌ విడుదల చేశాం. వాటికి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేయనున్నాం. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే రోజున చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ