Advertisement
Banner Ads

‘బీరువా’పై చాలా కాన్ఫిడెంట్‌గా వున్న యూనిట్‌

Sun 18th Jan 2015 11:44 PM
telugu movie beeruva,beeruva movie releasing on 23rd jan  ‘బీరువా’పై చాలా కాన్ఫిడెంట్‌గా వున్న యూనిట్‌
‘బీరువా’పై చాలా కాన్ఫిడెంట్‌గా వున్న యూనిట్‌
Advertisement
Banner Ads

సందీప్‌కిషన్‌, సురభి జంటగా ఉషాకిరణ్‌ ఫిలింస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై కన్మణి దర్శకత్వంలో రామోజీరావు నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘బీరువా’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 23న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తెలిపేందుకు ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో సందీప్‌ కిషన్‌, హీరోయిన్‌ సురభి, దర్శకుడు కన్మణి, లైన్‌ ప్రొడ్యూసర్‌ సుబ్రత్‌రాయ్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేత జెమిని కిరణ్‌, నటుడు నరేష్‌, ఎడిటర్‌ గౌతంరాజు, బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

బి.ఎ.రాజు: రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉషాకిరణ్‌ మూవీస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ కలిసి నిర్మించిన ‘బీరువా’ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కాగానే సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగా పెరిగిపోయాయి. బయ్యర్స్‌ పోటీ పడి మరీ ఈ చిత్రాన్ని కొన్నారు. ఈ రెండు బేనర్స్‌ ఇలాంటి మంచి చిత్రాలు ఇంకా తియ్యాలని, హీరో సందీప్‌ కిషన్‌కి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత ఈ సినిమా మరో సూపర్‌హిట్‌ సినిమా కావాలని కోరుకుంటున్నాను.

కన్మణి: రెండు పెద్ద సంస్థలు కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నాయంటే ఒక ఆడియన్‌గా నేను చాలా షాక్‌ అవుతాను. అలాంటిది ఆ సినిమాకి నేనే డైరెక్టర్‌ అవడం అనేది నేను నమ్మలేని విషయం. అది ఒక వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఈ సినిమా విషయంలో మా టార్గెట్‌ ఏమిటంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరూ కలిసి హ్యాపీగా చూడాలి. అలా చూడాలంటే సినిమాలో ఏదైనా స్పెషాలిటీ వుండాలి. దానికోసం స్టెప్‌ బై స్టెప్‌ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాం. మొదట ‘బీరువా’ అనే టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత థియేటర్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయిన తర్వాత బాగుంది అని చెప్పడమే కాకుండా అందులోని షాట్స్‌ గురించి కూడా డిస్కస్‌ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా ఇంత బాగా రావడంలో మా కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌, ఎడిటర్‌ గౌతంరాజు, మిగతా టెక్నీషయన్స్‌ కృషి ఎంతో వుంది. ఆర్టిస్టుల్లో నరేష్‌గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సందీప్‌తో ఆయన చేసిన ప్రతి సీన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ఆడియన్స్‌కి ఈ సినిమా ఒక ఫ్రెష్‌ మూవీ చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది.

నరేష్‌: ఈ సినిమాలో బీరువాతో నాకు ఎనిమిటీ వుంటుంది. అలాగే టెన్షన్‌ కూడా వుంటుంది. ఒక డిఫరెంట్‌ టైటిల్‌తో, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘బీరువా’ మీదే అందరి దృష్టీ వుంది. తప్పకుండా ఈ సినిమా జనవరిలో చిత్ర పరిశ్రమకు ఒక పండగలా వుంటుందనేది నా ఫీలింగ్‌. జంధ్యాలగారి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది డైరెక్టర్లతో నేను వర్క్‌ చేశాను. కానీ, కన్మణిలో నాకు చాలా ప్రత్యేకత కనిపించింది. ఆయన వల్ల నేను కొత్త బాడీ లాంగ్వేజ్‌ నేర్చుకున్నాను. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులుగానీ, పనిచేసిన టెక్నీషియన్స్‌గానీ ఎవరికి వారు తమ టాలెంట్‌ని చూపించారు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.

సురభి: తెలుగులో నాకు ఇది మొదటి సినిమా. నాకు ఇది వండర్‌ఫుల్‌ లాంచ్‌ అవుతుంది. నాకు తెలుగు భాషన్నా, తెలుగు సినిమాలన్నా చాలా ఇష్టం. ఈ సినిమా జరుగుతున్న ఆరు నెలలు ఎంతో ఎంజాయ్‌ చేస్తూ వర్క్‌ చేశాను. నాకు ఇది స్పెషల్‌ మూవీ. 

సందీప్‌ కిషన్‌: ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌లో ఇది నాకు రెండో సినిమా. ఒక పర్‌ఫెక్ట్‌ ప్రొడక్ట్‌ తీసుకురావాలన్న ఉద్దేశంతో అందరం ఎంతో జాగ్రత్తతో ఈ సినిమా చేశాం. కన్మణిగారు నన్ను ఈ సినిమాలో ఓ కొత్త కోణంలో చూపించారు. ఆయనలో వున్న స్పెషాలిటీ ఏమిటంటే ప్రతి సీన్‌ ఎలా చేయాలో యాక్ట్‌ చేసి మరీ చూపించేవారు. నేను చిన్నప్పటి నుంచి నరేష్‌గారి సినిమాలు చూస్తున్నాను. ఆయనతో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. అన్నివిధాలుగా ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది. ఈ సినిమాపై వున్న నమ్మకంతోనే నేను, నా ఫ్రెండ్‌ కలిసి గుంటూరు ఏరియా తీసుకున్నాం.

నరేష్‌, ముఖేష్‌ రుషి, చలపతిరావు, అజయ్‌, సప్తగిరి, వేణు, షకలక శంకర్‌, గుండు సుదర్శన్‌, శివన్నారాయణ, అనితా చౌదరి, అనీషా సింగ్‌, సంధ్య తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి డ్యాన్స్‌: రాజు సుందరం, బాబా భాస్కర్‌, శేఖర్‌, ఫైట్స్‌: వెంకట్‌, పాటలు: శ్రీమణి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్‌, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, లైన్‌ ప్రొడ్యూసర్‌: సుబ్రత్‌ రాయ్‌, నిర్మాత: రామోజీరావు, కథ,దర్శకత్వం: కణ్మణి. 

Advertisement
Banner Ads

Loading..
Loading..
Loading..
Advertisement
Banner Ads