బోయపాటి శ్రీను, శేఖర్ కమ్ముల.. తాజాగా విజయ్ కుమార్ కొండా. ఇలా అల్లు అర్జున్ తదుపరి సినిమాకు ఇతడే దర్శకుడు అంటూ ప్రతి రోజు ఓ కొత్త పేరు వినిపిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా షూటింగ్ త్వరలో కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే, మరో సినిమా స్టార్ట్ చేయాలనేది బన్ని ఆలోచన. ప్రస్తుతానికి ఎవరి సినిమా కమిట్ అవ్వకపోయినా, కథలు మాత్రం రెగ్యులర్ గా వింటున్నాడు. కథ నచ్చితే ఛాన్స్ ఇవ్వడానికి రెడీ, మంచి కథ ప్రిపేర్ చేయండి అని అల్లు అర్జున్ దర్శకులతో చెప్తున్నాడట. కొందరు తమ కథలను వినిపించారు. ఇలా కథ వినిపించడం ఆలస్యం, అలా మీడియాలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఇతడే అంటూ న్యూస్. మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఇంకా అల్లు అర్జున్ ఎవ్వరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ సినిమా స్టార్ కాకముందు గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ పేర్లు వినిపించాయి. తర్వాత వారు ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు బోయపాటి శ్రీను, శేఖర్ కమ్ముల, విజయ్ కుమార్ కొండాల పరిస్థితి అంతే అనుకోవాలా..? లేక ఎవరికైనా అదృష్టం వరిస్తుందో..? వెయిట్ & సి.