గత ఏడాది మార్చ్ 27న బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'లెజెండ్' సినిమా విడుదలైంది. పలు రికార్డులు సృష్టించిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో కలెక్షన్ల పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో అదే రోజు 'లయన్' సినిమాను విడుదల చేయాలనీ దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. హిట్ సెంటిమెంట్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారట. ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధికా అప్టే హీరోయిన్లు. ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.