‘కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్‌గా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్న ‘పులి’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి తెలుగులో ఇంకా టైటిల్ కన్‌ఫర్మ్ చెయ్యలేదు. విజయ్ సరసన శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమిళ్‌లో కూడా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సూపర్‌హిట్ మ్యూజిక్ అందించిన దేవి ఈ చిత్రానికి చేస్తున్న మ్యూజిక్‌కి ఆడియో రిలీజ్ అవకముందే చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. డిఫరెంట్ కథాంశంతో ఫాంటసీ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ చేసిన ఓ పాట విని థ్రిల్ అయిన నిర్మాతలు పి.టి.సెల్వకుమార్, శిబు.. దేవిశ్రీప్రసాద్‌కి గోల్డ్ రింగ్‌ను గిఫ్ట్‌గా అందించారు. ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ...
‘‘తమిళ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతున్న విజయ్ చేసే సినిమాకి మంచి హైప్ వుంటుంది. దానికి తగ్గట్టుగానే ‘పులి’ అనే టైటిల్ ఎనౌన్స్ చేయగానికి సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంబంధించి మూడు సాంగ్స్ కంపోజ్ చేశాను. అందులో ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. మరో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మూడో పాట రికార్డింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే శింబుదేవన్‌గారి స్క్రిప్ట్ విన్నాను. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. హీరో విజయ్‌ని అతని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ఆ రేంజ్‌లో ఈ సినిమా వుంటుంది. ఇది ఫాంటసీ చిత్రమైనప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా శింబుదేవన్‌గారు చాలా అద్భుతంగా తీస్తున్నారు. అద్భుతంగా వుండే ఫైట్స్, డాన్స్, పాటలు, కామెడీతో సహా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి సినిమాలో మ్యూజిక్‌కి చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా కేర్ తీసుకొని వర్క్ చేస్తున్నాను. సబ్జెక్ట్‌కి తగ్గట్టు గ్రాండియర్‌గా వుంటూనే పాటలు క్యాచీగా వుండేలా చేస్తున్నాను. యూనిట్ అంతా మ్యూజిక్ విషయంలో చాలా హ్యాపీగా వున్నారు. నిర్మాతలు సెల్వకుమార్, శిబు ఈ చిత్రానికి నేను చేసిన ఒక పాట విని చాలా థ్రిల్ అయ్యారు. వెంటనే మా రికార్డింగ్ స్టూడియోకి వచ్చి నాకు ఓ ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చి పాట చాలా ఎక్స్‌లెంట్‌గా వుందని అప్రిషియేట్ చేశారు. పాటల రికార్డింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ నుంచి అలాంటి అప్రిషియేషన్ రావడం చాలా సంతోషం కలిగించింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2015లో మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
శృతిహాసన్, హన్సిక, ఆలిండియా స్టార్ శ్రీదేవి, కన్నడ స్టార్ సుదీప్‌తో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్.కె.టి. స్టూడియోస్ బేనర్‌పై శింబు దేవన్ దర్శకత్వంలో పి.టి.సెల్వకుమార్, శిబు నిర్మిస్తున్నారు.