సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మరో అద్భుత నటుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్‌రికార్డ్ హోల్డర్ శ్రీమతి విజయనిర్మల మనవడు, వెర్సటైల్ యాక్టర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై రాంప్రసాద్ రఘుతు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.10 చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం జనవరి 16న హైదరాబాద్‌లోని సూపర్‌స్టార్ కృష్ణ ` విజయనిర్మల స్వగృహంలో నవీన్ విజయ్‌కృష్ణ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, సహజ నటి జయసుధ, నరేష్, హీరో నవీన్ విజయ్‌కృష్ణ పాల్గొన్నారు. ప్రొడక్షన్ నెం.10 చిత్రం టీజర్‌ను సూపర్‌స్టార్ కృష్ణ రిలీజ్ చేయగా హీరో ఫస్ట్‌లుక్‌ని సహజ నటి జయసుధ విడుదల చేశారు.
సూపర్‌స్టార్ కృష్ణ: ఫస్ట్ సినిమాకే మంచి ప్రొడ్యూసర్, పెద్ద టెక్నీషియన్స్ దొరకడం నవీన్ అదృష్టం. డెఫినెట్‌గా నెక్ట్స్ ఇయర్ బర్త్‌డేకి స్టార్‌డమ్‌తో స్టార్‌లా బర్త్‌డే జరుపుకుంటాడు, జరుపుకోవాలని ఆశిస్తున్నాను. టీజర్ చూశాను. నవీన్ బాడీలాంగ్వేజ్ చాలా బాగుంది. చాలా ఈజ్ వుంది. హెయిర్ స్టైల్, వాకింగ్ లుకింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. డెఫినెట్‌గా నవీన్ విజయ్‌కృష్ణలో స్టార్ అయ్యే లక్షణాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి. ప్రేక్షకులు, అభిమానుల ఆశీస్సులు నవీన్‌కి వుండాలని, పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను.
శ్రీమతి విజయనిర్మల: ‘‘నవీన్ ఫస్ట్ మూవీ ఇది. హీరోగా మా నవీన్ కొంచెం లేట్‌గా ఎంట్రీ అవుతున్నాడు. అతను ఫస్ట్ నుండి టెక్నీషియన్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో చేరి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. మోహన్‌బాబు గారు టీజర్ చూసి ఫోన్‌చేసి మీ అబ్బాయి గొప్ప హీరో అవుతాడు అని మా నరేష్‌తో అన్నారట. అలాగే నాకు ఫోన్‌చేశారు. నేను మద్రాసులో ఉన్నాను. మా అబ్బాయి నవీన్ చాలా అద్భుతంగా ఎడిట్ చేశాడు. మంచి హీరో అవుతాడు అన్నారు. ఎడిటర్‌గా ఉన్నపుడు రాత్రి పగలు కష్టపడి తన వర్క్ చేసుకుంటూ వుండే వాడు. సడన్‌గా హీరోగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. మేం అందరం యాక్సెప్ట్ చేసి ఓకే అన్నాము. రెండు సంవత్సరాలు కష్టపడి నవీన్ అన్నింట్లోనూ తర్ఫీదు పొంది ఈ సినిమాతో హీరోగా రాబోతున్నాడు. ఫస్ట్ మా నరేష్‌తో మేము సినిమా తీయాలనుకున్నాం. జంధ్యాల గారు వచ్చి నరేష్‌తో సినిమా తీశారు. సొంతంగా కాకుండా బయటి బ్యానర్స్ నుండి ఆఫర్స్ వస్తే మంచిది కదా అని డిసైడ్ అయ్యాం. అలాగే ఇప్పుడు చంటి అడ్డాలగారు వచ్చి మా నవీన్‌తో సినిమా తీస్తున్నారు. చాలా సంతోషంగా వుంది. మా అందరికీ కథ చాలా బాగా నచ్చింది. డెఫినెట్‌గా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందరు హీరోలతో, డైరెక్టర్స్‌తో వర్క్ చేశాను. చాలా హ్యాపీగా వుంది. జయసుధకి 13 ఏళ్ల వయసులో యాక్టింగ్‌లో మెళకువలు, నడకలు నేర్పించాను. అలాగే విజయశాంతిని పరిచయం చేశాను. చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశాను. అభిమానుల అండదండలు మాకెప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను.
నవీన్ విజయ్‌కృష్ణ: యాక్టర్‌గా ఇది నా ఫస్ట్ బర్త్‌డే. మీడియా, అభిమానులతో నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు, అభిమానుల ఆశీర్వాదాలు నాకు వుంటాయని ఆశిస్తున్నాను. ఫేస్‌బుక్ ఐ.డి. నవీన్ విజయ్‌కృష్ణ పేరుమీద లాంచ్ చేశాం. అలాగే ట్విట్టర్ ఐడి నవీన్ వి.కె. పేరు మీద లాంచ్ చేశాం. మా సినిమా డిటైల్స్ అన్నీ ఇందులో వుంటాయి. అందరూ చూసి ఫాలో కావాలని కోరుకుంటున్నాను.
చంటి అడ్డాల: మా హీరో నవీన్ నెక్ట్స్ బర్త్‌డేకి ఒక స్టార్‌లా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 19 నుండి ఫిబ్రవరి 15కి సినిమా కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి ది బెస్ట్ అనుకున్నాక సినిమా రిలీజ్ చేస్తాం. తొందరపడి రిలీజ్ చేయం. ఇండస్ట్రీలో వున్న పెద్ద వాళ్లందరికీ ఈ సినిమాని చూపించి జెన్యూన్‌గా వాళ్ల టాక్‌కి తీసుకుని అవసరమైతే రీషూట్ చేసి అయినా మంచి సినిమా అని మేము ఫీల్ అయ్యాకే ఈ సినిమాని రిలీజ్ చేస్తాం. హీరోగాకన్నా నవీన్ ఒక టెక్నీషియన్‌గా, ఎడిటర్‌గా ప్రతి ఫ్రేమ్ చెక్ చేసుకుని తనే ఎడిట్ చేసుకుంటున్నాడు. నేను పది శాతం మాత్రమే మూవీలో ఇన్వాల్వ్ అవుతున్నాను. మిగతా 90 శాతం హీరో, డైరెక్టర్ ఇద్దరే చూసుకుంటున్నారు. ఈ సినిమా నవీన్‌కి మంచి సక్సెస్‌ని ఇస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను.
రాంప్రసాద్ రఘుతు: ఇది నా ఫస్ట్ ఫిలిం. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల గారికి నా కృతజ్ఞతలు. చంటి గారికి కథ చెప్పినప్పుడు నేను ఒకటే పేరు సజెస్ట్ చేశాను. అది నవీన్. ఈ కథ నవీన్ అయితే బాగుంటుందని అప్రోచ్ అయ్యాను. తన బాడీ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి ఆల్‌మోస్ట్ టు ఇయర్స్ వెయిట్ చేశాం. ఈ టు ఇయర్స్‌లో నవీన్ పర్‌ఫెక్ట్‌గా రెడీ అయి వచ్చాడు. ప్రతిదీ చాలా కేర్‌ఫుల్‌గా తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. నవీన్‌తోపాటు నన్ను దీవించి ఈ సినిమాని మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నరేష్: మా ఫ్యామిలీ నుండి వస్తోన్న మూడో తరం. నవీన్‌లో అన్ని కళలు వున్నాయి. కీబోర్డ్ నేర్చుకున్నాడు. సంగీతంలో ప్రావీణ్యం వుంది. ఎడిటింగ్‌లో అనుభవం వుంది. కృష్ణవంశీ గారు ఫోన్‌చేసి ఇలాంటి ఎడిటింగ్ నేను చూడలేదు అన్నారు. నిజమా అని ఆశ్చర్యపోయాను. ఎడిటర్‌గా మంచి సర్కిల్ సంపాదించుకున్నాడు. ఒకరోజు నవీన్ వచ్చి డాడీ అందరూ నువ్ హీరో అయితే చాలా బాగుంటుంది అంటున్నారు అన్నాడు. అద్భుతంగా వుంటుంది నీకు. ఆ ధైర్యం, కాన్ఫిడెంట్ వుంటే నువ్ చేయి. నానమ్మకు చెప్పు గో ఎహెడ్ అన్నాను. కృష్ణగారి ఆశీర్వాదం, విజయనిర్మల గారి ఆశీర్వాదం తీసుకున్నాక టు ఇయర్స్ కష్టపడి హార్డ్‌వర్క్ చేశాడు. తెలుగు నుండి రెండు సినిమాలు, తమిళ్ నుండి ఒక సినిమా ఆఫర్ వచ్చింది. కానీ ముందు తెలుగు సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాం.
అనంతరం ఆల్ ఇండియా కృష్ణ, మహేష్ ప్రజాసేన అధ్యక్షుడు ఖాదర్ ఘోరి, సూపర్‌స్టార్ కృష్ణ ` మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దిడ్డి రాంబాబు, పల్లె జంగయ్యగౌడ్, రమణ తదితరులు ఏర్పాటుచేసిన భారీ కేక్‌ని కట్‌చేసి నవీన్ బర్త్‌డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.