విక్రమ్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ రూపొందించిన ‘ఐ’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి కలెక్షన్స్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ ఫిలింస్ వి. రవిచంద్రన్, మెగాసూపర్‌గుడ్ సంస్ధలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.
ఈ చిత్ర విజయం గురించి మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేతల్లో ఒకరైన ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ ` ‘‘శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందిన ‘ఐ’ చిత్రానికి అన్నిచోట్ల సూపర్‌హిట్ టాక్ వచ్చింది. కనివిని ఎరుగని కలెక్షన్స్‌ని రాబడుతోంది. ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డ్‌ని సృష్టిస్తుంది. చాలా ఆనందంగా వుంది. హీరో విక్రమ్ నటన గురించి మాటల ద్వారా చెప్పడం చాలా కష్టం. లింగేశం పాత్రలో తనదైన శైలిలో జీవించాడు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు అభినందనలు’’ అన్నారు.