Advertisementt

‘పడ్డానండి ప్రేమలో మరి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంఛ్‌

Fri 16th Jan 2015 07:25 AM
puri jagannath paddanandi premalo mari trailer  ‘పడ్డానండి ప్రేమలో మరి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంఛ్‌
‘పడ్డానండి ప్రేమలో మరి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంఛ్‌
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో వరుణ్‌సందేశ్‌ కథానాయకుడుగా పాంచజన్య మీడియా ప్రై. లి. పతాకంపై ఉప్పుటూరి మహేష్‌ దర్శకత్వంలో నల్లపాటి రామచంద్రప్రసాద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. ఈ చిత్రానికి సంబంధించిన థియేటరికల్‌ ట్రైలర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. అల్యూమినం ఫ్యాక్టరీలో జరుగుతున్న ‘టెంపర్‌’ చిత్రం షూటింగ్‌లో పూరి జగన్నాథ్‌ ‘పడ్డానండి ప్రేమలో మరి’ థియేటరికల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరుణ్‌సందేశ్‌ హీరోగా నిర్మాతల నల్లపాటి రామచంద్రప్రసాద్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీకి పెట్టిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ అనే టైటిల్‌ చాలా బాగుంది. పాటలను చూశాను. అందరినీ అలరించేలా, యూత్‌ని మెప్పించేలా ఉన్నాయి. ప్రోమో యువత మెచ్చేలా ఉంది. ఇది పెద్ద హిట్‌ అవుతుంది. మహేష్‌ తెరకెక్కించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు.

నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ` ‘‘పూరి జగన్నాథ్‌ చేతుల మీదుగా మా చిత్ర థియేటరికల్‌ ట్రైలర్‌ లాంచ్‌ కావడం ఆనందంగా వుంది. రెండు వందల థియేటర్లలో ఈ ట్రైలర్‌ ప్రదర్శింపబడుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆడియోని జనవరి 22న విడుదల చేసి, త్వరలో సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

వరుణ్‌సందేశ్‌, వితికశేరు, అరవింద్‌, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్‌, ఎంఎస్‌ నారాయణ, తెలంగాణ శకుంతల, రక్ష, కాశీ విశ్వనాధ్‌, పృధ్వీ, అనంత్‌, నల్ల వేణు, సారిక రామచంద్రరావు, అరుణ్‌కుమార్‌, చంటి, సంజనా జనక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.ఖుద్దూస్‌, మాటలు: విజయ్‌రామ్‌ప్రసాద్‌ వేప, కెమెరా: భరణి కె. ధరణ్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, పాటలు: చైతన్యప్రసాద్‌, కళ: కుమార్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: భీమనేని రాయుడు, ఫైట్స్‌: రవి, సమర్పణ: నల్లపాటి వంశీమోహన్‌, నిర్మాత: నల్లపాటి రామచంద్రప్రసాద్‌, కథ` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: మహేష్‌ ఉప్పుటూరి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ