Advertisementt

మరోసారి మెగాఫోన్‌ పట్టనున్న అమీర్‌ఖాన్‌..!!

Fri 16th Jan 2015 05:38 AM
aamir khan upcoming films,aamir khan directed films,aamir khan in pk,aamir khan barf,barf director aamir khan,taare jameenper  మరోసారి మెగాఫోన్‌ పట్టనున్న అమీర్‌ఖాన్‌..!!
మరోసారి మెగాఫోన్‌ పట్టనున్న అమీర్‌ఖాన్‌..!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్టు అమీర్‌ఖాన్‌ బహుముఖ ప్రజ్ఞశాలిగా గుర్తింపు పొందాడు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన తన విభిన్న పంథాను నిరూపించుకున్నాడు. గతంలో వచ్చిన 'తారే జమీన్‌ పర్‌' చిత్రంలో అమీర్‌ఖాన్‌ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అటు తర్వాత నటుడిగా బిజీగా మారడంతో మళ్లీ దర్శకత్వంవైపు అమీర్‌ఖాన్‌ దృష్టి సారించలేదు. అయితే ఆయన మళ్లీ ఇప్పుడు మెగాఫోన్‌ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కథను కూడా సిద్ధం చేసుకున్న అమీర్‌ఖాన్‌ ఆ చిత్రానికి 'బర్ఫ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. దీని గురించి అమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ.. చాలా రోజులుగా మళ్లీ దర్శకత్వం వహించాలని అనుకుంటున్నానని, ఇందుకోసం నాలుగేళ్ల క్రితమే కథ కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు నటుడిగా బిజీగా ఉండటంతో దర్శకత్వంవైపు దృష్టిసారించే అవకాశం రాలేదని, అయితే 'బర్ఫ్‌' చిత్రాన్ని తన దర్శకత్వంలోనే తెరకెక్కిస్తానని అమీర్‌ఖాన్‌ స్పష్టం చేశాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ