అత్యంత వేగంగా ఇండస్ట్రీలో పైస్థాయికొచ్చిన అమలాపాల్.. అంతే వేగంగా వివాహం కూడా చేసుకుంది. తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ను వివాహం చేసుకున్న అమలాపాల్‌కు సంబంధించి కొత్త రూమర్లు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె ప్రస్తుతం గర్భవతి అని, ఈ సందర్భంగా ఆమె భర్త అత్యంత విలువైన బహుమతులిచ్చాడని తమిళ మీడియా కోడై కూసింది. దీనికి సంబంధించి అమలాపాల్ కాస్త ఆలస్యంగా స్పందించారు. తాను క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నానని, అందరికీ శుభాకాంక్షలని కూడా చెప్పారు. అయితే మరోసారి మీడియాను నిరుత్సాహానికి గురిచేస్తున్నానని, తాను గర్భవతి అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తాను గర్భవతిని అయితే దాచాల్సిన అవసరం లేదని, అందరికంటే ముందుగా ఆ వార్తను మీడియాకే చెబుతానని కూడా చెప్పింది.