Advertisementt

'ఐ'తోపాటు రానున్న ఆ రెండు చిత్రాలు..!!

Wed 14th Jan 2015 06:04 AM
shankar i film,i release date,nani in evare subramaniyam,evare subramaniyam traile released,evare subramaniyam traile in i,sandeep kishan in tiger,tiger trailer,tiger trailer in i cinema  'ఐ'తోపాటు రానున్న ఆ రెండు చిత్రాలు..!!
'ఐ'తోపాటు రానున్న ఆ రెండు చిత్రాలు..!!
Advertisement
Ads by CJ

దక్షిణ భారతదేశంలో అత్యధిక థియేటర్లలో రిలీజవుతున్న 'ఐ' సినిమాను క్యాష్‌ చేసుకోవడానికి తెలుగు చిత్రాలు పోటీపడుతున్నాయి. శంకర్‌ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఐ' సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నాళ్లుగానే వేచిచూస్తున్నారు. ఈ క్యూరియాసిటీని క్యాష్‌ చేసుకోవడానికి నాని, సందీప్‌ కిషన్‌ చిత్రాలు పోటీపడుతున్నాయి. కొన్నాళ్లుగా సక్సెస్‌ లేక పూర్తిగా డీలా పడిపోయిన నాని చిత్రం 'ఎవడే సుబ్రమణ్యం' ట్రైలర్‌ను 'ఐ' సినిమా విడుదలవుతున్న అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇక అలాగే యువహీరో సందీప్‌ కిషన్‌ నటించిన 'టైగర్‌' సినిమా ట్రైలర్‌ను కూడా 'ఐ' రిలీజవుతున్న అన్ని థియేటర్లలో ప్రదర్శించాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించుకుంది. ఇక 'ఐ'తోపాటు ఇంటర్వెల్‌లో ఈ రెండు చిత్రాల ట్రైలర్‌లు కూడా ప్రేక్షకులను కనువిందుచేయనున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ