మలయాళంలో విజయవంతమైన 'బెంగళూరు డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ ముగ్గురు స్నేహితుల జీవన ప్రయాణం నేపథ్యంలో రొమాంటిక్ డ్రామా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, సమంతా, ఆర్యా, నిత్యమీనన్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు తెలిసింది. తాజాగా ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో సునీల్ నటించనున్నట్లు సమాచారం. 'భీమవరం బుల్లోడు' తర్వాత సునీల్ నటించిన మరే చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సినిమా కథ సునీల్‌కు బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇక తెలుగులో సునీల్ కనిపించనున్న పాత్రలో తమిళంలో బాబీసింహా నటిస్తున్నట్లు సమాచారం. పి.వి.పి బ్యానర్‌పై ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.