Advertisementt

మరో హీరోతోనూ చిత్రాన్ని నిర్మించనున్న నితిన్‌..!!

Tue 13th Jan 2015 06:32 AM
nithin upcoming films,nithin film with vishal,nithin film with akhil akineni,nithin produced films,nithin films list  మరో హీరోతోనూ చిత్రాన్ని నిర్మించనున్న నితిన్‌..!!
మరో హీరోతోనూ చిత్రాన్ని నిర్మించనున్న నితిన్‌..!!
Advertisement
Ads by CJ

కెరియర్‌లో విజయాల బాట పట్టిన తర్వాత నితిన్‌ పట్టిందల్లా బంగారమవుతోంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఏకంగా నితిన్‌ నాలుగు సినిమాలు వరుసగా విజయం సాధించాయి. ఇక ప్రస్తుతం నితిన్‌కు కలిసొస్తున్న లక్‌ను చూసి తన కుమారుడి మొదటి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశాన్ని కూడా నాగార్జున్‌ ఆయనకే  అప్పగించారు. అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై హీరో నితిన్‌ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోపాటే మరో భారీ సినిమా విశాల్‌ హీరోగా నిర్మి ంచడానికి నితిన్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శశికాంత్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. విక్రమ్‌గౌడ్‌ సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం నిర్మాణంలో విశాల్‌ సొంత నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ కూడా భాగస్వామిగా వ్యవహరించనుంది. విశాల్‌ నటిస్తున్న తొలి తెలుగు స్ట్రేట్‌ చిత్రం ఇదే కావడం విశేషం. ఫిబ్రవరిలో ఈ చిత్రంలో సెట్స్‌పైకి రానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ