Advertisementt

‘స్విమ్మింగ్‌ పూల్‌’ లోగో ఆవిష్కరణ

Sun 11th Jan 2015 05:36 AM
telugu movie swimming pool,swimming pool logo release,director chimmani manohar,  ‘స్విమ్మింగ్‌ పూల్‌’ లోగో ఆవిష్కరణ
‘స్విమ్మింగ్‌ పూల్‌’ లోగో ఆవిష్కరణ
Advertisement
Ads by CJ

అఖిల్‌ కార్తీక్‌, ప్రియ వశిష్ట జంటగా శ్రీశ్రీ మూవీస్‌ పతాకంపై చిమ్మని మనోహర్‌ దర్శకత్వంలో అరుణ్‌కుమార్‌ ముప్పన నిర్మిస్తున్న హార్రర్‌ థ్రిల్లర్‌ ‘స్విమ్మింగ్‌ పూల్‌’.  ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోను శనివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు ఓషో తులసిరామ్‌ లోగోను ఆవిష్కరించారు. విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో..

చిమ్మని మనోహర్‌: 13 రోజుల్లో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేయడం జరిగింది. ఫామ్‌హౌస్‌లో వున్న స్విమ్మింగ్‌పూల్‌ వల్ల ఒక ప్రేమ జంట ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారన్నదే కథ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే ఆడియోతోపాటు చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం.

అరుణ్‌ కుమార్‌ ముప్పన: ఈ చిత్రాన్ని పర్యావరణ పరిరక్షణ చేసే కార్భన్‌ న్యూట్రల్‌ విధానంతో సినిమాని తెరకెక్కించాం. ఇప్పటివరకు ఈ పద్ధతిలో ఎవరూ సినిమా చెయ్యలేదు. డైరెక్టర్‌ మనోహర్‌గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ