ఒకప్పటి హీరోయిన్.. ఇప్పుడు మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన జయసుధ తనయుడు హీరోగా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. జయసుధకు ఇద్దరు కుమారులున్నారు. అందులో పెద్దవాడు నిహార్ కపూర్, చిన్నవాడు శ్రేయన్ కపూర్. ప్రస్తుతం శ్రేయన్‌కపూర్ సినీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. కొన్నాళ్ల్లుగా పలు స్టోరీలు కూడా విన్న జయసుధ కుటుంబ సభ్యులు ఇటీవలె వాసు మంతెన అనే కుర్రాడు చెప్పన కథకు పచ్జజెండా ఊపినట్లు సమాచారం. జయసుధ భర్త నితిన్ కపూర్ కకూడా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కావడంతో వారిద్దరూ కలిసి కుమారుడి కెరియర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గా కూడా వాసు మంతెననే వ్యవహరించనున్నాడు. ఇక ఆరడుగులకు మించి హైట్ ఉండే శ్రేయన్‌కపూర్‌కు తగిన హీరోయిన్ వెతకే పనిలో ఇప్పుడు డైరెక్టర్ బిజీగా మారిపోయాడు.