అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించిన ‘అల్లుడు శీను’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తన తొలి చిత్రంతోనే 40 కోట్ల క్లబ్ చేరారు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. నూతన సంవత్సర కానుకగా ఇటీవల జెమిని టి.వి.లో ప్రసారమైన ఈ చిత్రానికి 16.9 రేటింగ్ రావడం టాక్ ఆఫ్ ఇది ఇండస్ట్రీ అయింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ` ‘‘శ్రీనివాస్ తన తొలి చిత్రంతోనే పెద్ద విజయాన్ని అందుకున్నాడు. అంతేకాకుండా ఇటీవల జెమిని టి.వి.లో ప్రసారమైన మా ‘అల్లుడు శీను’ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.