Advertisementt

23న వస్తున్న ‘భమ్ బోలేనాథ్’

Fri 09th Jan 2015 02:19 PM
telugu movie bam bholenath,director karthik varma,producer siruvuri rajesh varma,bam bholenath music director sai karthik,hero naveen chandra,hero navadeep,bam bholenath movie releasing on 23 january  23న వస్తున్న ‘భమ్ బోలేనాథ్’
23న వస్తున్న ‘భమ్ బోలేనాథ్’
Advertisement
Ads by CJ

‘మా సంస్థలో వచ్చిన కార్తికేయ’ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు ఎంత కొత్తగా ఫీలయ్యారో, ‘భమ్ బోలేనాథ్’ కూడా వారికి అలాంటి అనుభూతినే కలిగిస్తుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు పూర్తిగా సంతృప్తినిచ్చే చిత్రమిది.  ప్రేక్షకుడు సినిమాపై ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తుంది. మా బ్యానర్‌లో వచ్చిన ‘కార్తికేయ’ తరహాలోనే ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు శిరువూరి రాజేష్‌వర్మ. ఆయన నిర్మాతగా ఆర్.సి.సి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘భమ్ బోలేనాథ్’. నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకుడు. పూజ, ప్రాచీ కథానాయికలు. ఈ నెల 23న  ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ  సాయి కార్తీక్  సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. వాటికి చక్కని స్పందన వస్తోంది. పూర్తి వినోదాత్మక చిత్రమిది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా  ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంది. ముగ్గురు వ్యక్తుల జీవితాలు, మూడు కథలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందరికి నచ్చుతుందనే విశ్వాసముంది’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశలో వున్నాయి. సెన్సారు పూర్తిచేసి ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ