Advertisementt

‘మగమహారాజు’ ఆడియో ఆవిష్కరించిన రానా

Fri 09th Jan 2015 02:16 PM
vishal new movie magamaharaju,telugu movie magamaharaju,magamaharaju audio function,hero rana at magamaharaju audio function,heroine hansika motwani  ‘మగమహారాజు’ ఆడియో ఆవిష్కరించిన రానా
‘మగమహారాజు’ ఆడియో ఆవిష్కరించిన రానా
Advertisement

తమిళ్‌లోనే కాదు, తెలుగులో కూడా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకొని మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్‌ తమిళ్‌లో లేటెస్ట్‌గా హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంబల’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళ్‌లో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని విశాల్‌ పిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ‘మగమహారాజు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుందర్‌ సి. దర్శకత్వం వహించారు. విశాల్‌, హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో రానా ఆడియోను ఆవిష్కరించారు. హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందించిన ఈ ఆడియో వి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ ఆడియో వేడుకలో హీరో విశాల్‌, హీరోయిన్‌ హన్సిక, నటుడు వైభవ్‌రెడ్డి, సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమిళ, నిర్మాత విక్రమ్‌కృష్ణ, నటి శ్రేయారెడ్డి, ఐశ్వర్యరెడ్డి, ప్రముఖ నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్‌, విక్రమ్‌గౌడ్‌, పి.డి.ప్రసాద్‌, బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను రానా విడుదల చేశారు. ఈ చిత్రంలోని మొదటి పాటను విక్రమ్‌గౌడ్‌, రెండో పాటను శ్రేయారెడ్డి, మూడో పాటను శివలెంక కృష్ణప్రసాద్‌ రిలీజ్‌ చేశారు. 

రానా: ఈ సినిమాలో ముగ్గురు అత్త కూతుళ్ళు వున్నారు, చాలా యాక్షన్‌ వుంది, విశాల్‌ పోలీస్‌ యూనిఫామ్‌లో వున్నాడు. ఈ సినిమాలో అన్నీ వున్నాయని అర్థమైపోయింది. నేను ఇక్కడికి రావడానికి ముఖ్యకారణం ఏమిటంటే. చెన్నైలో నాకు చాలా మంది తెలుసు. అందరిలో వ్యక్తిగతంగా నాకు నచ్చే వ్యక్తి విశాల్‌. మనిషి చాలా మంచివాడు. ఈ సినిమాని హీరోగా నటిస్తూ నిర్మించాడు. ఈ సినిమా తమిళ్‌ కంటే తెలుగులో పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

హన్సిక: సుందర్‌గారితో ఇది నా మూడో సినిమా. తమిళ్‌లో ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. తెలుగులో కూడా ఆడియోతోపాటు సినిమా పెద్ద హిట్‌ అవుతందని ఆశిస్తున్నాను.

విక్రమ్‌గౌడ్‌: మగమహారాజుగా వస్తున్న విశాల్‌గారికి ఆల్‌ ది బెస్ట్‌. తెలుగులో మీరు స్ట్రెయిట్‌ సినిమా చెయ్యాలని కోరుతున్నాను.

శ్రేయారెడ్డి: ఈ సినిమాలో మ్యూజిక్‌ చాలా బాగుంది. తమిళ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది.

ఐశ్వర్యరెడ్డి: ఈ సినిమా ద్వారా తమిళను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం చేయడం ఆనందంగా వుంది. పాటలన్నీ చాలా బాగున్నాయి. తమిళ్‌లో ఆల్రెడీ ఆడియో హిట్‌ అయింది తెలుగులో కూడా ఈ పాటలు, సినిమా హిట్‌ అవుతాయి. 

హిప్‌హాప్‌ తమిళ: ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన నిర్మాత విశాల్‌గారికి థాంక్స్‌. ఈ ఆడియోకి తమిళ్‌లో చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తెలుగులో కూడా అదే ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం.

విశాల్‌: జనరల్‌గా యాక్టర్స్‌ గుడ్‌ ఫ్రెండ్స్‌ అవరు అని ఇండస్ట్రీలో చెప్తుంటారు. కానీ, ఇప్పుడు హీరోలు రియల్‌ ఫ్రెండ్స్‌గా, ట్రూ ఫ్రెండ్స్‌గా వుంటున్నారు. రానా నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. తను చేస్తున్న సినిమాలకు సంబంధించి నాతో మాట్లాడుతూ వుంటాడు. ఇక్కడికి గెస్ట్‌గా కాకుండా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌లా వచ్చాడు. సినిమా విషయానికి వస్తే చాలా బాగా వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న తమిళ్‌లో రిలీజ్‌ అవుతోంది. తెలుగులో ఎప్పుడు రిలీజ్‌ చెయ్యాలి అనేది ఇంకా అనుకోలేదు. ఈ చిత్రం ద్వారా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున తమిళ చాలా టాలెంట్‌ వున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ పాటల కంపోజింగ్‌ కోసం ఏ ఫారిన్‌కో వెళ్ళి చెయ్యలేదు. అతని రూమ్‌లోనే 2,500 రూపాయల ఖర్చుతో అయిపోయింది. అలాగే కొత్త కుర్రాడు రీరికార్డింగ్‌ ఎలా చేస్తాడో అనుకున్నాను. అయితే నా ఊహకి అందని విధంగా చాలా అద్భుతంగా చేశాడు. గతంలో నా సినిమాలను ఆదరించినట్టుగానే ఈ సినిమాని కూడా సూపర్‌హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను. నేను చెయ్యబోయే స్ట్రెయిట్‌ తెలుగు సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్‌ అవుతుంది. ఈ సంవత్సరంలోనే రిలీజ్‌ అవుతుంది.

విశాల్‌, హన్సిక, వైభవ్‌, ప్రభు, రమ్యకృష్ణ, ఐశ్వర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గోపి అమర్నాథ్‌, సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, సాహితి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వడ్డి రామానుజం, నిర్మాత: విశాల్‌, దర్శకత్వం: సుందర్‌ సి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement