సుధీర్‌బాబు, నందిత హీరోహీరోయిన్లుగా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.చంద్రు దర్శకత్వంలో శ్రీమతి, శ్రీ లగడపాలి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో గుమ్మడికాయ ఫంక్షన్‌తోపాటు చిత్రంలోని పాటల ప్రోమోస్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. పాటల ప్రోమోలను నిర్మాత శిరీషా శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
లగడపాటి శ్రీధర్: కన్నడంలో చార్మినార్ అనే చిత్రాన్ని రూపొందించారు చంద్రు. ఈ చిత్రానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాన్ని అందించింది. ఇప్పటివరకు చంద్రు నాలుగు సినిమాలు రూపొందించారు. సుధీర్‌బాబు, నందిత జంటగా రూపొందించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో సుధీర్‌బాబు నటన చాలా బాగుంది. అలాగే నంది పెర్‌ఫార్మెన్స్ సౌందర్యని గుర్తుచేస్తుంది.
చంద్రు: మా అన్నయ్యలిద్దరూ డాక్టర్‌గా, ఇంజనీర్‌గా మంచి పొజిషన్‌లో వున్నారు. ఇంటర్ కూడా పాస్ కాని నన్ను మా నాన్నగారు పొలం పని చెయ్యమన్నారు. ఓ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓల్డ్ స్టూడెంట్ డే ఫంక్షన్‌కి వెళ్ళాను. అక్కడ జరిగిన సంఘటనల్ని ఓ కథగా మలిచి చార్మినార్ అనే సినిమా తీశాను. దాన్ని శ్రీధర్‌గారి సహకారంతో రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇప్పుడు వారి బేనర్‌లో సినిమా చెయ్యడం ఆనందంగా వుంది.
సుధీర్‌బాబు: డైరెక్టర్ చంద్రు మా నుంచి చాలా మంచి నటన రాబట్టుకున్నారు. చాలా మంచి కథ. పెర్‌ఫార్మెన్స్‌కి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ వున్న క్యారెక్టర్ ఈ చిత్రంలో చేశాను. తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది.
నందిత: ఇది చాలా మంచి సినిమా అవుతుంది. మంచి కథతో చంద్రు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో సుధీర్‌బాబు చాలా మంచి కోస్టార్. నా కెరీర్‌లో ఇది ఒక మంచి సినిమా అవుతుంది.
ఈ చిత్రం గుమ్మడికాయ ఫంక్షన్‌లో హీరోలు నాగచైతన్య, రానా పాల్గొన్నారు. నాగచైతన్య హీరో సుధీర్‌బాబు, హీరోయిన్ నందితపై క్లాప్‌నిచ్చారు.