Advertisementt

‘సూర్య వర్సెస్‌ సూర్య’ టీజర్‌ లాంచ్‌

Thu 08th Jan 2015 05:09 AM
telugu movie surya vs surya,hero nikhil new movie,surya vs surya teaser launch,director karthik ghattamaneni,producer malkapuram shivakumar  ‘సూర్య వర్సెస్‌ సూర్య’ టీజర్‌ లాంచ్‌
‘సూర్య వర్సెస్‌ సూర్య’ టీజర్‌ లాంచ్‌
Advertisement
Ads by CJ

నిఖిల్‌, త్రిద జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్న వెరైటీ చిత్రం ‘సూర్య వర్సెస్‌ సూర్య’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ లాంచ్‌ కార్యక్రమం జనవరి 7న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా..

వి.వి.వినాయక్‌: ఈమధ్య నిఖిల్‌ చేసిన కార్తికేయ చూశాను. చాలా బాగుంది. సినిమా చూసిన వెంటనే ఫోన్‌ చేసి నిఖిల్‌ని, యూనిట్‌ని అభినందించాను. ఆ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని ఫోటోగ్రఫీ చాలా ఎక్స్‌లెంట్‌గా చేశాడు. ఈ సినిమాతో అతను డైరెక్టర్‌గా మారుతున్నందుకు హ్యాపీగా వుంది. ‘సూర్య వర్సెస్‌ సూర్య’ టైటిల్‌ కొత్తగా వుంది, అలాగే టీజర్‌ కూడా కొత్తగా వుంది. ఈ ట్రైలర్‌ చూస్తుంటే సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా అనిపించింది. ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది.

నిఖిల్‌: కార్తికేయ సక్సెస్‌కి సంబంధించి నాకు వచ్చిన మొదటి కాల్‌ వినాయక్‌గారిదే. నన్ను అప్రిషియేట్‌ చెయ్యడమే కాకుండా నాకు కొన్ని మంచి సలహాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహాతోనే కథ విషయంలో, దర్శకుడి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. కార్తికేయ టైమ్‌లో పరిచయమైన శివకుమార్‌గారు ఈ సినిమాకి నిర్మాత కావడం ఆనందంగా వుంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. 

తనికెళ్ల భరణి: కార్తీక్‌ చెప్పిన కథ విన్న తర్వాత మొదట ఈ సినిమా వద్దని అనుకున్న నేను వెంటనే చేస్తానని చెప్పాను. ఇది చాలా మంచి సబ్జెక్ట్‌ స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్‌హిట్స్‌ చేసిన నిఖిల్‌కి ఈ సినిమా కూడా మంచి హిట్‌ అవుతుంది. కార్తీక్‌ డైరెక్షన్‌ చాలా బాగుంది. భవిష్యత్తులో అతను మంచి డైరెక్టర్‌ అవుతాడని నమ్మకం వుంది. 

సుధీర్‌వర్మ: వరస హిట్స్‌తో వెళ్తున్న నిఖిల్‌కి ఈ సినిమా మరో హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. 

చందు మొండేటి: ఈ కథని కార్తికేయ చిత్రం కంటే ముందే రెడీ చెయ్యడం జరిగింది. చాలా మంచి కథ. దానికి మంచి మాటలు కూడా కుదిరాయి. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది. 

త్రిదా: ఇది ఫస్ట్‌ మూవీ. కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. 

కార్తీక్‌ ఘట్టమనేని: నేను అనుకున్న ఒక డిఫరెంట్‌ పాయింట్‌ని నేను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో నిర్మాత శివకుమార్‌గారి సపోర్ట్‌ ఎప్పటికీ మర్చిపోలేను. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందర్నీ అలరించే చిత్రమవుతుంది. 

మల్కాపురం శివకుమార్‌: కార్తికేయ మంచి విజయం సాధించింది. మంచి కథతో రూపొందిన ఈ చిత్రం కూడా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. కార్తీక్‌ చెప్పిన దానికంటే సినిమా బాగా తీశాడు. దానికి తగ్గట్టుగానే నిఖిల్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. ఈ సినిమా మేం అనుకున్న టైమ్‌కి కంప్లీట్‌ కావడంలో చందు మొండేటి సహకారం ఎంతో వుంది. ఈ సినిమా నిర్మాణంలో నన్ను సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. 

తనికెళ్ల భరణి, మధుబాల, రావురమేష్‌, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, రాజా రవీంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం: సత్య మహావీర్‌, మాటలు: చందు మొండేటి,  ఎడిటర్‌: గౌతం నెరుసు, డాన్స్‌: విజయ్‌, ఫైట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: టి.గంగాధర్‌రెడ్డి, నిర్మాత: మల్కాపురం శివకుమార్‌, రచన, దర్శకత్వం: కార్తీక్‌ ఘట్టమనేని.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ