Advertisementt

‘ముకుంద’ సక్సెస్‌ మీట్‌

Wed 07th Jan 2015 03:43 AM
telugu movie mukunda,hero varun tej,mukunda success meet,mukunda movie review,mukunda stills,director srikanth addala  ‘ముకుంద’ సక్సెస్‌ మీట్‌
‘ముకుంద’ సక్సెస్‌ మీట్‌
Advertisement

మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ముకుంద’. డిసెంబర్‌ 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌ రన్‌ అవుతున్న నేపథ్యంలో మంగళవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్‌తేజ్‌, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, చిత్ర సమర్పకుడు ఠాగూర్‌ మధు, నటులు రావు రమేష్‌, ఆలీ, ప్రభు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావు: నాకు ఎంతో ఇష్టమైన నటుడు నాగబాబు. ఆయన కుమారుడు వరుణ్‌తేజ్‌ చేసిన తొలి చిత్రం ‘ముకుంద’లో అతనికి తండ్రిగా నటించడం చాలా ఆనందం కలిగించింది. తన మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా తన క్యారెక్టర్‌ని చేశాడు. హీరోగా తప్పకుండా అతనికి మంచి భవిష్యత్తు వుంటుంది. ఈ చిత్రం ఇంత మంచి సక్సెస్‌ సాధించడం చాలా సంతోషంగా వుంది.

రావు రమేష్‌: ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చి నాతో చేయించిన శ్రీకాంత్‌కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి పేరు వస్తుందనుకున్నాను. కానీ, ఇంత మంచి పేరు వస్తుందని ఊహించలేదు. బ్రహ్మానందంగారు కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్‌ చేశారు. రేసుగుర్రంలో తను చేసిన క్యారెక్టర్‌కి కూడా అంత పేరు వస్తుందని తనూ ఊహించలేదని అన్నారు. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన వరుణ్‌ తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. తన స్నేహితుడికి ఎలాంటి విషయంలోనైనా నేనున్నానంటూ ఆదుకునే ధీరోదాత్తుడిగా చాలా అద్భుతంగా చేశాడు. శ్రీకాంత్‌ అడ్డాల గురించి చెప్పాలంటే చాలా మంచి డైరెక్టర్‌. తెలుగుదనం ఉట్టిపడేలా ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా చూపిస్తారు. ఇలాంటి సినిమాలు ఆయన ఇంకా ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను.

ఆలీ: రావుగోపాలరావుగారు, చిరంజీవిగారి కాంబినేషన్‌లో వచ్చిన అభిలాష వారికి ఎంత మంచి పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్‌, రావుగోపాలరావుగారి తనయుడు రావు రమేష్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్‌ అయినందుకు సంతోషంగా వుంది. ఇంతకుముందు రావు రమేష్‌ని రావుగోపాలరావుగారి అబ్బాయి అనేవారు. కానీ, ఇప్పుడు రావు రమేష్‌ తండ్రి రావుగోపాలరావు అనే రేంజ్‌లో అతని పెర్‌ఫార్మెన్స్‌ వుంది. ఇలాంటి క్యారెక్టర్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాలకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం వుంది. అలాగే వరుణ్‌ మొదటి సినిమాలో అతని పక్కన నేను కూడా ఒక మంచి క్యారెక్టర్‌ చెయ్యడం హ్యాపీగా వుంది. ఇలాంటి సినిమాలు వరుణ్‌, శ్రీకాంత్‌ అడ్డాల ఇకముందు కూడా చెయ్యాలని కోరుకుంటున్నాను.

ప్రభు: ఈ సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. ఇంత మంచి సినిమాని తీసిన ఠాగూర్‌ మధుగారికి, బుజ్జిగారికి, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలగారికి, హీరో వరుణ్‌కి కంగ్రాట్స్‌. ఈ విజయంలో నేను కూడా ఒక పార్ట్‌ అయినందుకు చాలా సంతోషంగా వుంది. 

శ్రీకాంత్‌ అడ్డాల: ఈ సినిమాతో నా జర్నీ స్టార్ట్‌ అవడానికి ఠాగూర్‌ మధుగారే కారణం. ఈ కథను సినిమాగా చేద్దామని అనుకున్న తర్వాత నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ కావచ్చు, వరుణ్‌ మొదటి సినిమా వేరే వాళ్ళతో చేస్తున్నారని అనుకోవడం, తర్వాత మళ్ళీ నేనే చేయడం ఇలా ఎన్నో మలుపులు తిరిగింది. షూటింగ్‌ అంతా ఎంతో హ్యాపీగా చేశాం. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని నిజాయితీగా కోరుకొని చాలా కష్టపడి పనిచేశారు. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. 13, 14 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్‌ చేసిందని చెప్తున్నారు. దానికి కూడా చాలా హ్యాపీగా వుంది. వరుణ్‌ మొదటి సినిమా నేను డైరెక్ట్‌ చేయడం చాలా ఆనందంగా ఫీల్‌ అయ్యాను. అతను పెద్ద హీరో అయిన తర్వాత కూడా నాకు ఛాన్స్‌ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రావుగోపాలరావుగారంటే నాకెంతో ఇష్టం. ఆయన్ని స్క్రీన్‌ మీద చూడడం తప్ప ఎప్పుడూ కలిసే అవకాశం రాలేదు. ఈ సినిమాలో రావు రమేష్‌గారు తన క్యారెక్టర్‌ని ఎంతో క్రమశిక్షణతో ఎంతో కష్టపడి చేశారు. ఆ క్యారెక్టర్‌కి వస్తున్న క్రెడిట్‌ అంతా ఆయనకే దక్కుతుంది. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులూ పరుచూరి వెంకటేశ్వరరావుగారి గైడెన్స్‌ నాకెంతో ఉపయోగపడిరది. చలిచీమలు సినిమా చేస్తున్న టైమ్‌లో ఇలాగే పనిచేసేవారిమని ఆయన చెప్తుంటే నాకెంతో సంతోషం కలిగింది. ఆలీగారితో ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేశాను. ఆయన కూడా ఎంతో బాగా చేశారు. ఇక టెక్నీషియన్స్‌ గురించి చెప్పాలంటే పేరు పేరునా అందరికీ థాంక్స్‌ చెప్పాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా సినిమా ఇంత బాగా రావడానికి కెమెరామెన్‌ మణికందన్‌ సహకారం ఎంతో వుంది. అలాగే అద్భుతమైన పాటలు, రీరికార్డింగ్‌ చేసిన మిక్కీ జె.మేయర్‌ సినిమాకి బాగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

వరుణ్‌తేజ్‌: మొదట్లో మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చినప్పటికీ స్లోగా పికప్‌ అయి ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా థియేటర్స్‌కి వచ్చి సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంత మంచి సక్సెస్‌ అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇలాంటి సినిమాల కోసమే ఎదురుచూస్తున్నామని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. శ్రీకాంత్‌గారు చేసే సినిమాలు చాలా నేచురల్‌గా వుంటాయి. నా మొదటి సినిమా ఇలాంటి డైరెక్టర్‌తో చేస్తేనే ఆడియన్స్‌కి బాగా రీచ్‌ అవుతుందని నాన్నగారు, నేను అనుకోవడం, సినిమా కూడా అందరికీ రీచ్‌ అవడం ఆనందంగా వుంది. మొదటి సినిమా అయినా చాలా బాగా చేశావని చెప్తున్నారు. రామ్‌లక్ష్మణ్‌ ఫైట్స్‌ చాలా డిఫరెంట్‌గా కంపోజ్‌ చేశారు. మిక్కీ చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ చేశారు. దాదాపు 100 రోజులు ఈ సినిమా షూటింగ్‌ చేశాం. యూనిట్‌లోని అందరూ ఫ్రెండ్స్‌ అయిపోయారు. షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ దూరమవడం చాలా బాధ కలిగించింది. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ కావడంలో సహకరించిన యూనిట్‌ సభ్యులకు, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement