ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి హిట్ చిత్రాల్ని నిర్మించిన సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బి.ఎ.రాజు బర్త్‌డే జనవరి 7. ఈ సందర్భంగా ఫిబ్రవరి నుండి ఆర్.జె. సినిమాస్ బేనర్‌పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో ఓ అద్భుతమైన చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు. సూపర్‌హిట్ ఫిలిం వీక్లీ ఎడిటర్‌గా, హిట్ చిత్రాల నిర్మాతగా, భారీ చిత్రాల టాప్ పి.ఆర్.ఓ.గా విజయపథంలో దూసుకెళ్తున్న బి.ఎ.రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది ఆర్.జె.సినిమాస్, సూపర్‌హిట్ ఫ్రెండ్స్ యూనిట్.