హీరో సూర్య పక్కన నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అలాంటిది సూర్య సినిమానుంచి అర్ధంతరంగా తప్పుకుంది అమీ జాక్సన్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా 'మాస్' చిత్రం తెరకెక్కుతోంది. హారర్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. మొదటి హీరోయిన్‌గా నయనతారను తీసుకోగా రెండో హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను ఎంపికచేశారు. అమీ జాక్సన్ ఇందులో ఘోస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అమీ జాక్సన్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న భారీచిత్రం 'ఐ'లో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాతో అమీ జాక్సన్‌కు స్టార్‌డమ్ కచ్చితమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అంతగా ప్రాధాన్యం లేని పాత్రలో.. అందులో దెయ్యంగా కనబడటం కెరియర్‌కు మంచిది కాదని శ్రేయుభిలాషులు అమీజాక్సన్‌కు సూచించినట్లు సమాచారం. దీంతో అర్ధతరంగా అమీజాక్సన్ ఈ సినిమానుంచి తప్పుకుంది. ఇప్పటికీ సూర్యతో నటించే అవకాశాన్ని కోల్పోతున్నా.. భవిష్యత్తులో తనకు తప్పకుండా మరో అవకాశం వస్తుందని అమీ జాక్సన్ చెబుతోంది.