Advertisementt

వంద రోజులకు దూసుకెళ్తున్న 'పిల్లా నువ్వు లేని జీవితం'

Sun 04th Jan 2015 01:11 AM
pilla nuvvu leni jeevitham movie completed 50 days,pilla nuvvu leni jeevitham movie hero saidharam tej,regina in pilla nuvvu leni jeevitham,pilla nuvvu leni jeevitham movie running towards 100 days,pilla nuvvu leni jeevitham director ravi kumar chowdar  వంద రోజులకు దూసుకెళ్తున్న 'పిల్లా నువ్వు లేని జీవితం'
వంద రోజులకు దూసుకెళ్తున్న 'పిల్లా నువ్వు లేని జీవితం'
Advertisement
Ads by CJ
సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన పిల్లా నువ్వు లేని జీవితం యాభై రోజులు పూర్తి చేసుకొని వంద రోజుల దిశగా దూసుకెళ్తోంది. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో మంచి కలెక్షన్లు వసూలు చేసింది. గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నివాసు, హర్షిత్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.  అనూప్ అందించిన సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. హీరోయిన్ రెజీనా అందచందాలు, పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచాయి. జగపతిబాబు యాక్షన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా విజయవంతంగా వంద రోజుల వైపు దూసుకెళ్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసింది. 
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...గీతా ఆర్ట్స్ తో కలిసి మా సంస్థ ద్వారా సాయి ధరమ్ తేజ్ హీరోగా తొలి సినిమా చేయడం... యాభై రోజులు పూర్తి చేసుకొని వంద రోజుల వైపుగా దూసుకెళ్లడం చాలా హ్యాపీగా ఉంది. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా విడుదలకు ముందు నుంచే మంచి క్రేజ్ సంపాదించుకొని భారీగా ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టింది. సాయి ధరమ్ తేజ్, రెజీనా, జగపతి బాబు పెర్ ఫార్మెన్స్, రవి కుమార్ డైరెక్షన్ టాలెంట్, స్క్రీన్ ప్లే మ్యాజిక్, అనూప్ మ్యూజిక్...ఇలా అన్ని డిపార్ట్ మెంట్స్ సమిష్టి కృష్టితో ఈ సినిమా ఘనవిజయం సాధించింది. బన్నివాసు, హర్షిత్ నిర్మాణ పరంగా చాలా కష్టపడి క్వాలిటీ సినిమా అందించారు. పిల్లా నువ్వు లేని జీవితం చిత్రాన్ని ఇంతటి ఘనవిజయం చేసి యాభై రోజుల నుంచి వంద రోజుల దిశగా తీసుకెళ్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ మా యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అని అన్నారు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ