వరుణ్‌తేజ్ మొదటి సినిమా 'ముకుందా' మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఆయన రెండో చిత్రం గురించి ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని పూరి జగాన్నాథ్ లేదా క్రిష్ డైరెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. అయితే గతంలో మెగా హీరోలంతా తమ మొదటి సినిమాను ఇతరుల బ్యానర్‌లో చేసి రెండో చిత్రాన్ని మాత్రం గీతా ఆర్ట్స్‌లో నటించి భారీ విజయాలను అందుకున్నారు. రాంచరణ్‌తేజ్(మగధీర), అల్లు శిరీష్(కొత్త జంట), సాయి ధరమ్‌తేజ్(పిల్లా నువ్వు లేని జీవితం) చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇక ఇప్పుడు వరుణ్‌తేజ్ రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నటించనుండటంతో ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని మెగా అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.