‘జానకిరాముడు’, ‘బొబ్బిలి సింహం’, ‘ఘరానాబుల్లోడు’, ‘సమరసింహారెడ్డి’, ‘సింహాద్రి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగథీర’, ‘ఈగ’ వంటి ఎన్నో సూపర్‌డూపర్ హిట్ చిత్రాలకు రచన చేసిన వి.విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ ‘బాహుబలి’కి పనిచేస్తున్నారు. 2011లో విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ‘రాజన్న’ చిత్రానికి నంది అవార్డును అందుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీ తెరెక్కనుంది. ఈ చిత్రం ద్వారా వి.రాఘవేంద్రరాజును హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంలో తనకు అవకాశం వచ్చిన క్రమాన్ని హీరో వి.రాఘవేంద్రరాజు ప్రస్తావిస్తూ..
‘‘నేను వైజాగ్‌లోని సత్యానంద్‌గారి ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. శిక్షణ పూర్తయిన తర్వాత ఈ సినిమా కోసం విజయేంద్రప్రసాద్‌గారు నన్ను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. విజయేంద్రప్రసాద్‌గారి డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో రూపొందే ఈ సినిమా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనుంది. విజయేంద్రప్రసాద్‌గారు లాంటి గొప్ప రచయిత, దర్శకుడితో తొలి సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రముఖ దర్శకుడు సుకుమార్, రేష్మ ఆర్ట్స్ రాజ్‌కుమార్‌గారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు’’ అన్నారు.