Advertisementt

వైవస్వత లోగో విడుదల..!

Fri 02nd Jan 2015 08:06 AM
vaivaswatha,varun,karthik,nagraju,telugu,tamil,puraanalu,bhavishyatthu,art director,visual effects,fantasy,ilayaraaja,music director  వైవస్వత లోగో విడుదల..!
వైవస్వత లోగో విడుదల..!
Advertisement
Ads by CJ

సింహవాహిని చలనచిత్ర పతాకంపై , మోక్ష శ్రీమయీ సమర్పిస్తున్న సినిమా వైవస్వత. ఈ సినిమా టైటిల్ లోగోని గురువారం హైదరాబాద్ లో లాంచ్ చేసారు.

ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో డైరెక్టర్స్ లో ఒకరైన వరుణ్ మాట్లాడుతూ "తెలుగు, తమిళ్ రెండు భాషలలోను ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పని సంవత్సరం నుండి చేస్తున్నామని చెప్పారు. వైవస్వతుడు అంటే మత్స్య పురాణానికి చెందిన ఒక జ్ఞాని అని పురాణాలకు , భవిష్యత్తును కలిపే ఒక కాన్సెప్టే ఈ సినిమా అని అన్నారు".

మరొక దర్శకుడైన కార్తిక్ మాట్లాడుతూ " ఇదొక ఫాంటసీ సినిమా, సైన్స్ సమాదానం చెప్పలేని ఎన్నో విషయాలకు ఎప్పుడో పుట్టిన సిద్ధాంతాల నుండి సమాదానాలు దొరుకుతున్నాయి. అదే కాన్సెప్ట్ ను సినిమా గా తెరకెక్కించబోతున్నామని చెప్పారు".

నిర్మాత ఎస్.నాగరాజు మాట్లాడుతూ "ఆర్ట్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రాణం పోసాయని, విశ్వరూపం సినిమాతో నేషనల్ అవార్డు పొందిన ఎన్.ఇళయరాజా ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారని చెప్పారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడే చెప్పమని సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు త్రిల్ ఫీల్ అవుతారని అన్నారు. టైటిల్ రోల్ సాయికుమార్ చేస్తున్నారని మరొక ముఖమైన పాత్రలో సురేష్ నటిస్తున్నారని చెప్పారు". 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ