అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్‌లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీి గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో రుద్రమదేవి క్యారెక్టర్, మిగతా ముఖ్యపాత్రలకు ఒరిజినల్ నగలను ఉపయోగించడం విశేషం. నూతన సంవత్సరం సందర్భంగా 5 కోట్ల విలువైన ఆభరణాలు ధరించిన ‘రుద్రమదేవి’ అనుష్క న్యూ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ ` ‘‘భారతదేశ సినీ చరిత్రలో ‘జోధా అక్బర్’ తర్వాత నిజమైన బంగారు ఆభరణాలని చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’కి వినియోగించండం జరిగింది. వీటిని చెన్నైలోని ఎన్. ఏ. సి జ్యూవెలర్స్ ప్రత్యేకంగా దేశంలోని వివిధ ప్రదేశాల్లోని నిపుణులతో తయారు చేయించారు. ఈ నగలని చిత్రంలో రుద్రమదేవిగా నటిస్తున్న అనుష్కతో పాటు ముఖ్యపాత్రలు ధరించడం జరిగింది. చిత్రం విడుదల సందర్భంగా త్వరలో ఈ నగలన్నింటినీ ఎన్. ఏ. సి జ్యూవెలర్స్‌వారు ‘రుద్రమదేవి కలెక్షన్స్’ పేరిట వినియోగదారులకి అందుబాటులోకి తేనున్నారు. ఈ నగలు 13వ శతాబ్దంలోని కాకతీయ వైభవాన్ని చాటిచెప్పే రీతిలో అప్పటి కళానైపుణ్యాన్ని కలిగి, ఇప్పటి వారినికూడా ఎంతో ఆకట్టుకునే రీతిలో రూపొందిచబడ్డాయి. భారతదేశంలోనే మొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, నిత్యమీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్‌కుమార్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, ఆదితి చెంగప్ప, సన, రక్ష తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా(జోధా అక్బర్ ఫేం), ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్. సూపర్‌వైజర్: కమల్ కణ్ణన్(ప్రసాద్ ఇ.ఎఫ్.ఎక్స్.), మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయిబాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్‌గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.