Advertisementt

‘గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌సింగ్‌’ ఆడియో రిలీజ్‌.!

Tue 30th Dec 2014 03:52 AM
gang of gabbar singh audio release,gang of gabbar singh movie director m.s.babu,telugu movie gang of gabbar singh,gang of gabbar singh movie audio function stills,gang of gabbar singh movie stills,gang of gabbar singh movie trailers  ‘గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌సింగ్‌’ ఆడియో రిలీజ్‌.!
‘గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌సింగ్‌’ ఆడియో రిలీజ్‌.!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో అంత్యాక్షరి సీన్‌ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఆ సీన్‌లో నటించిన ఆర్టిస్టులతో తారా నీలు కార్పోరేషన్‌ పతాకంపై ఎం.ఎస్‌.బాబు స్వీయ దర్శకత్వంలో ‘గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌సింగ్‌’ పేరుతో పూర్తి వినోదాత్మక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మానస్‌, శ్వేతావర్మ జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం బాధ్యతలను కూడా ఎం.ఎస్‌.బాబు నిర్వహించడం విశేషం. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. విజయేందర్‌రెడ్డి ఆడియోను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గోరటి వెంకన్న, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హేమాస్‌ మీడియా  అధినేత కె.సురేష్‌బాబు, పద్మిని తదితరులు పాల్గొన్నారు. 

ఎం.ఎస్‌.బాబు: ఇప్పటివరకు 20 కార్పోరేట్‌ యాడ్స్‌తోపాటు 150 ఇతర కంపెనీల యాడ్స్‌ చేశాను. నేను స్వతహాగా పవన్‌కళ్యాణ్‌గారి అభిమానిని. ఈ చిత్రానికి కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఎస్‌.కె.మక్బూల్‌ నాకు బ్రదర్‌లాంటివాడు. ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి పూర్తి చేయడంలో మక్బూల్‌ ఎంతో సపోర్ట్‌ చేశాడు. ఒక మంచి సినిమా చేశానన్న సంతృప్తి నాకు కలిగింది. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. 

మానస్‌: పవన్‌కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్‌ని అయిన నేను ఈ చిత్రంలో గబ్బర్‌సింగ్‌ గ్యాంగ్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా వుంది. ఇది ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌. కామెడీని ఎంజాయ్‌ చేసే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

గోరటి వెంకన్న:  ఈ సినిమాలో మంచి కథ, మంచి హాస్యంతోపాటు ఒక సందేశం కూడా వుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.

మానస్‌, శ్వేతావర్మ, షకీలా, హరనాథ్‌, భవ్య, ఆంజనేయులు, బంటి, రిమ్‌సన్‌రాజ్‌, ప్రవీణ్‌, రమేష్‌, సాయి, లాల్‌ మధార్‌, శ్రావణ్‌, కుట్టిపాల్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: గిరి దొసాడ, ఎడిటింగ్‌: ఉపేంద్ర, మేకప్‌: ఈశ్వర్‌, డాన్స్‌: ఆండ్రూస్‌పాల్‌, బ్రదర్‌ ఆనంద్‌, కో`ప్రొడ్యూసర్‌: ఎస్‌.కె.మక్బాల్‌, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఎం.ఎస్‌.బాబు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ