ఆకాష్ ద్విపాత్రాభియంలో రహమత్ ప్రొడక్షన్స్ గోల్డెన్ ఫిలింస్ నిషా సమర్పణలో దేవంతి దర్శకత్వంలో ఖాదర్‌వల్లి నిర్మిస్తున్న ‘ఒక విలన్ ప్రేమకథ’ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో ఆకాష్, హీరోయిన్ సోనియాశర్మ, దర్శకురాలు దేవంతి, నిర్మాత ఖాదర్‌వల్లి, సమర్పకురాలు నిషా, కొరియోగ్రాఫర్ రాక్ వేణు, మాటల రచయిత మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
ఆకాష్: నేను చెన్నైలో ఓ తమిళ చిత్రం షూటింగ్‌లో వుండగా దేవంతిగారు అక్కడికి వచ్చారు. తను చేయబోయే సినిమాలోని క్యారెక్టర్‌కు నేనయితే బాగుంటుందని అన్నారు. అయితే నేను ఆ టైమ్‌లో బిజీగా వుండడంతో చేయలేనని చెప్పాను. నా కోసం వెయిట్ చేస్తానని చెప్పారు. ఏడు నెలల నాకోసం వెయిట్ చేశారు. పాండిచ్చేరిలో ఈ సినిమాని స్టార్ట్ చెయ్యడం జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. డిఫరెంట్ పర్సనాలిటీతో వుండే క్యారెక్టర్ నాది. మూడు గెటప్స్‌తో ఈ సినిమాలో కనిపిస్తాను. రెండో షెడ్యూల్‌ని సంక్రాంతి తర్వాత హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌లో చేస్తున్నాం. మార్చి 18 నా పుట్టినరోజు. ఆ డేట్‌కి రిలీజ్ చేద్దామని దేవంతిగారు అన్నారు. అయితే ఆరోజు బుధవారం కావడం వల్ల నా బర్త్‌డే తర్వాత వచ్చే శుక్రవారం చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం.
దేవంతి: నా మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నందుకు ఆకాష్‌గారికి థాంక్స్. సాధారణంగా కొత్తవారిని ఎంకరేజ్ చేయరు. కానీ, ఆకాష్‌గారు నాకు ఎంతో సపోర్ట్‌గా వుంటూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది. తప్పకుండా మా యూనిట్‌లోని అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది.
ఖాదర్‌వల్లి: తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న డిఫరెంట్ సినిమా ఇది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆకాష్‌గారికి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుందని నా ఉద్దేశం.
సోనియాశర్మ: ఇది నా మొదటి సినిమా. ఇంత మంచి సినిమాలో నటించడం గ్రేట్ ఆపర్చునిటీగా భావిస్తున్నాను.
ఆకాష్, లక్ష్మీ, సోనియాశర్మ, నిషా(స్పెషల్ అప్పియరెన్స్), సత్యం రాజేష్, అంబటి శ్రీను, సుమన్‌శెట్టి, దినేష్ మ్యాడ్ని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దేవరాజ్, సంగీతం: యు.కె.మురళి, పాటలు: ధీరజ అప్పాజీ, మాటలు: మణికంఠ, ఎడిటింగ్: సామ్రాట్, డాన్స్: రాక్‌వేణు, సమర్పణ: నిషా, నిర్మాత: ఖాదర్‌వల్లి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దేవంతి.