Advertisementt

రెండో షెడ్యూల్‌లో ‘ఆమె ఎవరు?’

Mon 29th Dec 2014 05:00 AM
telugu movie aame evaru,aame evaru first schedule completed,aame evaru in second schedule,aame evaru movie director ramesh mugada,aame evaru music director chinni krishna,aame evaru producer veeraganesh karri  రెండో షెడ్యూల్‌లో ‘ఆమె ఎవరు?’
రెండో షెడ్యూల్‌లో ‘ఆమె ఎవరు?’
Advertisement
Ads by CJ

ఆర్తీ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో కోరుకొండ  శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో శ్రీ బాలగణపతి ప్రొడక్షన్స్‌, శ్రీ సాయిదుర్గా చిత్రాలయ పతాకాలపై రమేష్‌ ముగడ దర్శకత్వంలో వీరగణేష్‌ కర్రి, లక్ష్మీ సరోజ నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘ఆమె ఎవరు?’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని భూత్‌ బంగ్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...

ఆర్తీ అగర్వాల్‌: ఇప్పటి వరకు నేను చేయని క్యారెక్టర్‌ ఇది. ఈ చిత్రంలో కామెడీతోపాటు చాలా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. తప్పకుండా ఇది చాలా మంచి చిత్రమవుతుంది.

వీరగణేష్‌ కర్రి: సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్‌ షెడ్యూల్‌ని కంప్లీట్‌ చేశాం. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. రమేష్‌ ముగడ ఈ సినిమా ప్రారంభానికి ముందు నాకు ఏదైతే కథ చెప్పాడో దానికంటే చాలా బెటర్‌గా తీస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రం రూపొందుతోంది.

రమేష్‌ ముగడ: ప్రస్తుతం జరుగుతున్న రెండో షెడ్యూల్‌ జనవరి 10 వరకు జరుగుతుంది. మూడో షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి ఫస్ట్‌ వీక్‌లో సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం.

చలపతిరావు, సత్యం రాజేష్‌, ధన్‌రాజ్‌, నల్లవేణు, సైదులు, అల్లరి సుభాషిణి, అపూర్వ, పి.యస్‌.కుమార్‌, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ, కెమెరా: సేనాపతి, మాటలు: ఫణీంద్ర, ఓం ప్రసాద్‌ వాకాటి, పాటలు: సురేష్‌ గంగుల, కైలాస్‌ బొమ్మాళి, నిర్వహణ: పైలా సత్యనారాయణ కుమార్‌, నిర్మాతలు: వీరగణేష్‌ కర్రి, లక్ష్మీ సరోజ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమేష్‌ ముగడ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ