Advertisementt

‘బుల్లెట్‌ రాణి’ షూటింగ్‌ పూర్తి.!

Sun 28th Dec 2014 04:15 AM
nisha kothari latest movie bullet rani,bullet rani in telugu and kannada,telugu movie bullet rani,bullet rani stills,nisha kothari as bullet rani,bullet rani director iqbal  ‘బుల్లెట్‌ రాణి’ షూటింగ్‌ పూర్తి.!
‘బుల్లెట్‌ రాణి’ షూటింగ్‌ పూర్తి.!
Advertisement
Ads by CJ

  సెక్సీ సైరన్‌ నిషా కొఠారి పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘బుల్లెట్‌రాణి’. తెలుగు`కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘ఫోకస్‌ ఆన్‌ పిక్చర్స్‌’ పతాకంపై ఎం.ఎస్‌.యూసఫ్‌ నిర్మిస్తున్నారు. ఇక్బాల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఇటీవల హైద్రాబాద్‌లో జరిగిన చివరి షెడ్యూల్‌తో షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. 

యాక్షన్‌ప్యాక్డ్‌ మాస్‌మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘బుల్లెట్‌రాణి’ చిత్రం గురించి చిత్ర దర్శకుడు ఇక్బాల్‌ మాట్లాడుతూ.. ‘‘సెక్స్‌ బాంబ్‌’ ఇమేజ్‌ కలిగిన నిషా కొఠారి డేర్‌ డెవిల్‌, రఫ్‌ అండ్‌ టఫ్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రమిది. సంఘ విద్రోహశక్తులపై.. ఓ లేడీ గబ్బర్‌సింగ్‌లా ఆమె విరుచుకుపడే తీరు అందర్నీ అబ్బురపరుస్తూ అమితంగా అలరిస్తుంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ ఫిలింగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘గ్లామర్‌`యాక్షన్‌`కామెడి’ల కలగలుపుగా రూపొందిస్తున్నాం. తెలుగుతోపాటు, కన్నడలోనూ సైమల్టేనిస్‌గా రూపొందుతున్న ఈ ‘మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌’ ద్వారా తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకుగాను మా నిర్మాత ఎం.ఎస్‌.యూసఫ్‌గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను’ అన్నారు. 

ఆశిష్‌ విద్యార్ధి, షఫి, తాగుబోతు రమేష్‌, రవి కాలె, అమిత్‌, జస్పర్‌, చేతన్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: వి.సురేష్‌కుమార్‌, కాస్ట్యూమ్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: నాగు, ప్రెస్‌ రిలేషన్స్‌: ధీరజ అప్పాజీ, యాక్షన్‌: థ్రిల్లర్‌ మంజు, మ్యూజిక్‌: గున్వంత్‌, నిర్మాత: ఎం.ఎస్‌.యూసఫ్‌, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఇక్బాల్‌ !!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ