Advertisementt

ఇంటర్వ్యూ : రాకేష్‌ శ్రీనివాస్‌

Sun 28th Dec 2014 04:13 AM
  ఇంటర్వ్యూ : రాకేష్‌ శ్రీనివాస్‌
ఇంటర్వ్యూ : రాకేష్‌ శ్రీనివాస్‌
Advertisement
Ads by CJ

షఫి ప్రధాన పాత్రలో సమిష్టి క్రియేషన్స్‌ పతాకంపై రాకేష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో విజయకుమార్‌రాజు, రాకేష్‌ శ్రీనివాస్‌ సంయుక్తంగా నిర్మించిన డిఫరెంట్‌ మూవీ ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్‌’(నా సినిమా నా ఇష్టం). ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 1న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు రాకేష్‌ శ్రీనివాస్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్‌’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో సినిమా చేశారు. టైటిల్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

ఈ సినిమా ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ టైటిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్‌కి నేను ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్‌ వచ్చింది, వస్తోంది కూడా. 

కాంట్రవర్సీ కోసమే ఈ టైటిల్‌ పెట్టారని అనుకోవచ్చా?

అలాంటి ఉద్దేశం నాకు లేదు. సినిమాలో విషయం లేకపోతే కాంట్రవర్సీ చేసినా ఆడియన్స్‌ థియేటర్స్‌కి రారు. కాంట్రవర్సీ వల్ల సినిమాలు రన్‌ అవుతాయని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కాంట్రవర్సీ ఎప్పుడైనా రిలీజ్‌ రోజు మార్నింగ్‌ షో వరకే వుంటుంది. ఆ తర్వాత సినిమాలో దమ్ము వుంటేనే ప్రేక్షకులు చూస్తారు. 

ఇది ఎలాంటి సినిమా అని చెప్తారు?

ఇది ఒక సెటైరికల్‌ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌. వ్యవస్థ మీద కావచ్చు, ఒక వ్యక్తి మీద కావచ్చు. ఈ విషయం ట్రైలర్‌లోనే అర్థమయ్యేలా చూపించే ప్రయత్నం చేశాం. అయితే అది ఎలాంటి సెటైర్‌ అనేది సినిమా రిలీజ్‌ రోజు మార్నింగ్‌ షో వరకు హోల్డ్‌లో పెట్టాలని అనుకున్నాను. అందుకని దాని గురించి ఏమీ చెప్పలేకపోతున్నాను. 

ఇది సినిమా నేపథ్యంలో తీసిన సినిమానా?

సినిమా అనేది కథలో ఒక లేయర్‌ మాత్రమే తప్ప హండ్రెడ్‌ పర్సెంట్‌ సినిమా నేపథ్యం వుండదు. 

షఫి క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?

అతను ఒక ఫిల్మ్‌ డైరెక్టర్‌. వయెలెన్స్‌, రక్తపాతం, పగ, ప్రతీకారాలతో సినిమాలు తియ్యడం అతని ప్యాషన్‌. అలాంటి సినిమాలు తియ్యడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాడనేదే కథ. 

మీ మొదటి సినిమాకి ఇలాంటి టిపికల్‌ సబ్జెక్ట్‌ని సెలెక్ట్‌ చేసుకోవడానికి రీజన్‌?

ఒక కొత్త డైరెక్టర్‌ తన మొదటి సినిమాతో ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడంటే మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసే  సబ్జెక్ట్‌తోనే ట్రై చెయ్యాలి. నా దగ్గర ఉన్న కథల్లో ఇది నా డెబ్యూ మూవీగా చాలా ఉపయోగపడుతుందని ఈ కథను సెలెక్ట్‌ చేసుకోవడం జరిగింది. 

ట్రైలర్స్‌, స్టిల్స్‌ చూస్తే  రామ్‌గోపాల్‌వర్మని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసినట్టు అనిపిస్తోంది. దీనికేమంటారు?

అలా అని నేను ఏ ప్రెస్‌మీట్‌లోనూ చెప్పలేదు, ఎక్కడా మెన్షన్‌ చెయ్యలేదు. టైటిల్‌ కూడా రామ్‌గోపాల్‌వర్మని తలపించేట్టు వున్న మాట వాస్తవమే కానీ ఆయన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం చెయ్యలేదు. 

ఈ క్యారెక్టర్‌కి షఫినే సెలెక్ట్‌ చేసుకోవడానికి కారణం?

` నటనలో ఇంటెన్సిటీ వున్న ఆర్టిస్టులు ఇక్కడ చాలా తక్కువ మంది వున్నారు. నానా పాటేకర్‌, మనోజ్‌ బాజ్‌పేయి లాంటి ఆర్టిస్టులు బాలీవుడ్‌లో చాలా మంది వున్నారు. వీళ్ళంతా నేషనల్‌ డ్రామా నుంచి వచ్చినవారు. అలా వచ్చినవారు తెలుగులో షఫి ఒక్కరే. అందుకే ఆయనతో చేయించడం జరిగింది అంటూ ఇంటర్వ్యూ ముగించారు ‘ఎ శామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్‌’ డైరెక్టర్‌ రాకేష్‌ శ్రీనివాస్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ