Advertisementt

ఇంటర్వ్యూ: శ్రీకాంత్‌ అడ్డాల

Sun 28th Dec 2014 04:12 AM
director srikanth addala,srikanth addala latest movie mukunda,varun tej and srikanth addala combo movie mukunda,mukunda movie review,mukunda collections,mukunda music director micky j.mayor  ఇంటర్వ్యూ: శ్రీకాంత్‌ అడ్డాల
ఇంటర్వ్యూ: శ్రీకాంత్‌ అడ్డాల
Advertisement
Ads by CJ

కొత్తబంగారులోకం వంటి యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీతో డైరెక్టర్‌గా పరిచయమై రెండో ప్రయత్నంగా వెంకటేష్‌, మహేష్‌ వంటి స్టార్‌ హీరోలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మల్టీస్టారర్‌ను రూపొందించి ఒక సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శ్రీకాంత్‌ అడ్డాల. లేటెస్ట్‌గా మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఠాగూర్‌ మధు, నల్లమలుపు శ్రీనివాస్‌ నిర్మించిన ‘ముకుంద’ చిత్రాన్ని తనదైన బాణీలో తెరకెక్కించారు. తన ప్రతి సినిమాలోనూ మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రాన్ని కూడా అదే కోవలో రూపొందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, రోజు రోజుకీ ప్రేక్షకాదరణ పెరుగుతోందని చెప్తున్నారు డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల. మరి ఈ చిత్రానికి వస్తున్న స్పందన ఎలా వుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. 

‘ముకుంద’ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

` కనుమరుగవుతున్న మానవీయ విలువల్ని ఈ చిత్రం ద్వారా మరోసారి వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాను. మొదటి రెండు రోజులు డివైడ్‌ టాక్‌ వచ్చిన మాట వాస్తవం. అయితే సినిమా గురించి, సినిమాలో మేం చూపించిన అంశాల గురించి మౌత్‌టాక్‌ బాగా రావడంవల్ల కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 

రెగ్యులర్‌ లవ్‌స్టోరీలా కాకుండా డిఫరెంట్‌గా ట్రై చెయ్యడానికి రీజన్‌?

` ఇప్పుడు ప్రేమికుల మధ్య మాటలు ఎక్కువైపోయాయి. అవి పర్సనల్‌గా కావచ్చు, ఫోన్‌లో కావచ్చు. ఎలాంటి ఉపయోగం లేని మాటలతో టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో నువ్వు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకో అంటే చేసుకునేవారు. అమ్మాయిలు కూడా అలాగే వుండేవారు. పెళ్ళి పీటల మీద తప్ప ఆ అమ్మాయిని కలుసుకోవడం, మాట్లాడడం జరిగేది కాదు. కానీ, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునేవారు, సంసారాలు సజావుగా సాగిపోయేవి. ఇప్పుడు చాలా మాటలు మాట్లాడుకుంటున్నారు. కానీ, ఎన్ని జంటలు పెళ్ళయిన తర్వాత అనోన్యంగా వుంటున్నారు చెప్పండి. ఈ సినిమాలో మాత్రం రుక్మిణి, శ్రీకృష్ణుల ప్రేమను బేస్‌ చేసుకొని హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను చూపించడం జరిగింది. పెళ్ళిళ్ళు అనేవి పైనే నిర్ణయించబడతాయి అనే విషయాన్ని ఈ జంట ద్వారా చెప్పడం జరిగింది.

హీరోయిన్‌కి పేరు కూడా పెట్టకపోవడానికి కూడా ఏదైనా కారణం వుందా?

ఈ విషయం సినిమా పూర్తయ్యేంతవరకు మాకు తోచలేదు. ఆ అవసరం కూడా రాలేదు. అయినా ఏదో ఒక పేరు ఏదో ఒక సీన్‌లో చెప్పించేద్దాం అని ట్రై చేశాం. కానీ, అలాంటి అవకాశం ఏ సీన్‌లోనూ కనిపించలేదు. దాంతో అలా వున్నా ఫర్వాలేదు అనుకున్నాం. 

మీ సినిమాలోని క్యారెక్టర్లను రియల్‌ లైఫ్‌ నుంచే తీసుకుంటారా?

` అలాంటివి కూడా వుంటాయి. చాలా వరకు మనం చూసినవాళ్ళు. కొంతమంది గురించి మనకు వేరే వాళ్ళు చెప్పిన సంఘటలను సినిమాలో పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఏ క్యారెక్టర్‌ అయినా, ఏ సంఘటన అయినా రియల్‌ లైఫ్‌ నుంచి వచ్చింది అయితేనే కరెక్ట్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవుతుందని నా అభిప్రాయం. 

టౌన్‌ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా తియ్యడానికి స్పెషల్‌ రీజన్‌ ఏదైనా వుందా?

` వుందండీ. ఇప్పటివరకు సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వచ్చాయి, విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వచ్చాయి. కానీ, మధ్యస్తంగా టౌన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు ఎక్కువగా రాలేదు. అందుకని టౌన్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేశాం. 

రావురమేష్‌ క్యారెక్టర్‌ సినిమాలో బాగా ఎలివేట్‌ అయింది. అతని క్యారెక్టర్‌కి ఇన్‌స్పిరేషన్‌ వుందా?

 నాకు సూర్యకాంతంగారు, ఎస్వీరంగారావుగారంటే చాలా ఇష్టం. అలాగే రావుగోపాలరావుగారు కూడా. ఇందులో రావు రమేష్‌గారు చేసిన క్యారెక్టర్‌ చాలా పెక్యులర్‌గా వుంటుంది. ఆయన మాత్రమే ఆ క్యారెక్టర్‌ చెయ్యగలరు అన్నంతగా చేశారు. చాలా మంది రావుగోపాలరావుగారి క్యారెక్టర్‌లా వుందని అంటున్నారు. నాకు ఇష్టమైన ఆర్టిస్టుల ఫోటోలను సినిమాలో ఎక్కడో ఒక చోట కనిపిస్తే బాగుంటుందని అనుకుంటాను. అందుకే ఈ సినిమాలో రావుగోపాలరావుగారి ఫోటోను పెట్టడం జరిగింది. 

రావు రమేష్‌తో చెప్పించిన డైలాగులు వెరైటీగా వున్నాయంటున్నారు. దీనికి మీరెలా ఫీల్‌ అవుతున్నారు?

 కొత్తగా వుండాలని అలాంటి డైలాగుల్ని రాయడం జరిగింది. అవి అందరికీ నచ్చాయంటే అంతకంటే కావాల్సింది ఏముంది? ఈ సినిమాలో మున్సిపల్‌ ఛైర్మన్‌ అనేవాడు తుపాకులు వాడడు. మాటలనే తూటాలుగా పేల్చుతాడు. ఆ మాటల్ని కూడా చాలా వెటకారంగా చెప్తాడు. నార్మల్‌గా చెప్పించడం కంటే ఫిజిక్స్‌, మరోవైపు జాగ్రఫీలను డైలాగ్స్‌లో వాడితే కొత్తగా వుంటుందని ట్రై చేశాను. 

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

` నా నెక్స్‌ట్‌ మూవీ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.  బ్రహ్మోత్సవం అనే టైటిల్‌ అనుకుంటున్నాను. అది ఎవరి బేనర్‌లో చేస్తాను, హీరో ఎవరు ఈ విషయాలన్నీ ప్రొడ్యూసర్‌గారితో చెప్పిస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. త్వరలోనే ఆ వివరాలు ప్రకటిస్తాము అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ