ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> 'TNIT South Indian Media Awards 2026' Press meet

23న TNIT సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ వేడుక

'TNIT South Indian Media Awards 2026' Press meet'TNIT South Indian Media Awards 2026' Press meet

దక్షిణాది మీడియా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులు, మీడియా సంస్థలు, డిజిటల్ క్రియేటర్ల సేవలను గుర్తించి పురస్కరించేందుకు ‘TNIT మీడియా అకాడమీ’ ఆధ్వర్యంలో ‘TNIT సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ 2026’ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెల్లడించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు, సీనియర్ ఎడిటర్లు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

యాక్టర్ అలీ మాట్లాడుతూ “అందరికీ నమస్కారం. అవార్డులు నటులకు, దర్శకులకు, టెక్నీషియన్లకు, మిగతా అన్ని డిపార్ట్‌మెంట్లకు కూడా దొరుకుతుంటాయి. కానీ వాళ్లందరినీ హైలైట్ చేసే ఒక రిపోర్టర్‌కు అవార్డు ఇవ్వాలనే ఆలోచన రావడం చాలా అద్భుతమైన విషయం. రఘు  గారికి ఇలాంటి ఆలోచన రావడం చాలా ఆనందంగా ఉంది. రిపోర్టర్లకు, ఫోటోగ్రాఫర్లకు ఇలా మీడియా రంగంలోని అందరికీ అవార్డులు ఇవ్వడంతో పాటు ఒక హెల్త్ కార్డు కూడా ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. దానికి నా సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ హెల్త్ కార్డు ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. అక్టోబర్ 23న బెంగళూరులో ఈ వేడుక జరుగుతుంది. అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.”

దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ: మీడియా సినీ పరిశ్రమలోని కళాకారులను ప్రోత్సహిస్తుంది. వాళ్లు లేకపోతే మాకు గుర్తింపు లేదు. అలాంటి మీడియాను ‘TNIT సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్’తో సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకను చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. వారు ఈ వేడుకను ప్రతి ఏడాది ఇలాగే నిర్వహించాలని కోరుకుంటున్నాను. నిర్వాహకులకు నా అభినందనలు.”

నిర్మాత రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ: కెమెరా వెనక ఉండే వాళ్లకు కూడా అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం. మీడియా అనేది పరిశ్రమకు ఎంతో అవసరం. అలాంటి మీడియాను గుర్తించి అవార్డులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. రఘు గారు నాలుగు భాషలను కలిపి అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం.”

రఘు భట్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. అలీ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, రేలంగి నరసింహారావు గారికి ధన్యవాదాలు. అక్టోబర్ 23న బెంగళూరులో ఈ వేడుక జరుగుతుంది. మీడియాలోని అన్ని క్యాటగిరీల వారికి ఈ అవార్డులు ఇస్తాము. సినిమా, పొలిటికల్ బ్యూరో, మెట్రో, కెమెరా డిపార్ట్‌మెంట్లతో పాటు అన్ని విభాగాల వారికి అవార్డులు ఇస్తున్నాము. అలాగే ప్రింట్ మీడియాకు కూడా అవార్డులు అందజేస్తున్నాము. నామినీలందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.”

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ: ఈ వేడుకను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల నుంచి జర్నలిస్టులను తీసుకొచ్చి, వారికి అద్భుతమైన వసతులు కల్పించి, వారిని గౌరవించి చాలా గ్రాండ్‌గా ఫంక్షన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది.  
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మీడియా రంగంలో నిజాయితీగా, నిరంతరాయంగా కృషి చేస్తున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఒకే వేదికపై గౌరవించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.

TNIT South Indian Media Awards 2026 to Honour Media Professionals Across South India