Advertisementt

సినీజోష్ రివ్యూ: జైలర్

Thu 10th Aug 2023 03:30 PM
jailer  సినీజోష్ రివ్యూ: జైలర్
Cinejosh Review: Jailer సినీజోష్ రివ్యూ: జైలర్
Advertisement
Ads by CJ

సినీజోష్ రివ్యూ: జైలర్ 

బ్యానర్: సన్ పిక్చర్స్ 

నటీనటులు: రజినీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రఫ్, శివ రాజ్ కుమార్, తమన్నా, సునీల్, రమ్యకృష్ణ , యోగి బాబు తదితరులు. 

మ్యూజిక్ డైరెక్టర్: అనిరుద్ రవిచంద్రన్ 

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్ 

ఎడిటింగ్: R నిర్మల్ 

ప్రొడ్యూసర్: కళానిధి మారన్ 

దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్ 

రిలీజ్ డేట్: 10-08-2023

సూపర్ స్టార్ రజినీకాంత్ తన వయసుకి తగిన పాత్రలని ఎంచుకునే పనిలో ఉన్నారు. తన స్థాయికి తగిన కథల కోసం అన్వేషిస్తున్నారు. ఈ ప్రాసెస్ లో కబాలి, కాలా, పెటా, దర్భార్, అన్నత్థే ఇలా వరసగా పరాజయాలు ఆయనకి ఎదురవుతున్నాయి. ఆ దర్శకుడి ముందు చిత్రం పెద్ద ప్లాప్ అయినా అతను చెప్పిన కథని నమ్మి కదిలారు రజినీ. బీస్ట్ చేసిన నెల్సన్ ఇప్పుడు అతనికి రజినీ ఇచ్చిన అవకాశం జైలర్. ముందస్తుగా ఈ సినిమాపై పెద్దగా అంచనాలేవి లేకపోయినా.. తమన్నా ఒక పాటతో ఊపేసింది. ట్రైలర్ ఓ రేంజ్ బజ్ రప్పించింది. ఓవరాల్ గా రజిని రేంజ్ ఓపెనింగ్స్ తోనే వచ్చిన జైలర్ ఎలా ఉందంటే.. 

జైలర్ స్టోరీ:

టైగర్ ముత్తు పాండ్యన్ (రజనీకాంత్) రిటైర్డ్ జైలర్. ఆయన తన భార్య, కొడుకు, కోడలు, మనవడు ( రమ్యకృష్ణ, వసంత్ రవి, మిర్నా మీనన్)తో ప్రశాంతంగా కాలం గడుపుతుంటాడు. పోలీస్ ఆఫీసరైన ముత్తు కొడుకు ( వసంత్ రవి) ఆలయంలో దేవుడి విగ్రహం చోరీ గురించిన కేసును దర్యాప్తు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో విగ్రహాలను అక్రమంగా తరలించే ముఠా నాయకుడు (వినాయన్) ముత్తు కుటుంబానికి హాని తలపెడతాడు. నిజాయితీగా ఉద్యోగం చేసే తన కొడుకుకు, తన ఫ్యామిలీకి తీరని అన్యాయం చేసిన వినాయన్ పై ముత్తు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే జైలర్ పూర్తి కథ. అయితే ఈ కథలో జైలర్ ముత్తు కి మ్యాథ్యూస్ (మోహన్ లాల్), నరసింహ (శివరాజ్ కుమార్)‌కు ఉన్న కనెక్షన్ ఏమిటో తెర మీద చూడాల్సిందే.  

జైలర్ ఎఫర్ట్స్ 

జైలర్ గా వింటేజ్ లుక్‌తో సూపర్ స్టార్ కొత్తగా కనిపించారు. తీహార్ జైలు ఎపిసోడ్‌లో పాత రజనీని చూసే అవకాశం కలుగుతుంది. ఫ్యామిలీ కోసం ప్రాణాలు పణంగా పెట్టే రిటైర్డ్ జైలర్‌ పాత్రలో ఆయన చాలా హుందాగా.. క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎమోషనల్ గా జీవించారు. రజనీ గెటప్, బాడీ ల్వాంగేజ్ ఫ్యాన్స్‌కు పండుగలా ఉంటుంది. తాతయ్య లుక్ లోనే యాక్షన్ సీన్స్ కుమ్మేసారు. శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ జస్ట్ గెస్ట్ కేరెక్టర్ అయినా.. వారిద్దరూ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వినయన్ విలనిజం పవర్ ఫుల్ గా ఉంది. అందులో తమిళ నేటివిటీ మిక్స్ అయ్యింది. మిగితా క్యారెక్టర్లలో కామెడీ టచ్‌తో పాటు కథకు కీలకంగా ఉండే ట్రాక్‌లో సునీల్ క్యారెక్టర్ ఆకట్టుకొంటుంది. తమన్నాతో కలిసి సునీల్ సెకండాఫ్‌లో ఎంటర్టైన్ చేసాడు. ఇక రమ్యకృష్ణ హౌస్ వైఫ్ గా, జాకీ ష్రాఫ్ చిన్న పాత్రలకే పరిమితమయ్యారు. అలాగే యోగిబాబు-రజినీకాంత్ కాంబో కామెడీ కూడా బాగా నవ్వించింది. 

సాంకేతికంగా చెప్పుకోవాల్సిన ప్రధాన అంశాలు.. మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్ అన్నీ కీలకంగా జైలర్ కి హెల్ప్ చేసాయి. అనిరుద్ రవిచంద్రన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలిచింది. కెమెరా మ్యాన్ విజయ్ కార్తీక్ కన్నన్ ప్రతి సన్నివేశాన్ని రిచ్ గా కలర్ ఫుల్ గా చూపించారు. ఎడిటర్ కూడా ఎలాంటి మొహమాటానికి పోకుండా తన పని తాను చక్కగా పూర్తి చేసాడు. నిర్మాత కళానిధి మారన్ కాంప్రమైజ్ కి పోలేదు.. కావాల్సినన్ని అందించడంలో ఏ లోటు చెయ్యలేదు. 

దర్శకుడు నెల్సన్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ పట్టుకొచ్చాడు రజినీ కోసం. ప్రోపర్ గా తీసాడు ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి తడబడ్డాడు. రజినీ రేంజ్ కి తగ్గ కంక్లూజన్ ఇవ్వలేకపోయాడు. అక్కడే కొట్టింది తేడా.. సెకండ్ హాఫ్ కాస్త కాన్సంట్రేట్ చేసి ఉంటే, ఫస్ట్ హాఫ్ రేంజ్ లో గ్రిప్పింగ్ గా తీసుకుంటే రజినీ రేంజ్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ చూసుండేవాళ్ళం. ఇప్పుడిది దిలీప్ నెల్సన్ సినిమాగా మిగిలిపోయింది. 

జైలర్ ఎనాలసిస్:

తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రత్యేకంగా విచ్చేసిన రజినీకాంత్ తన సొంత సినిమా జైలర్ ప్రమోషన్స్ కి మాత్రం ఈసారి సమయం కేటాయించలేదు. అసలు తెలుగు రాష్ట్రాలవైపు కన్నెత్తి చూడలేదు. దానితో జైలర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రావాల్సినంత బజ్ రాలేదు. తమిళనాడు రాష్ట్రంలోనే ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గొప్పగా పెర్ ఫామ్  చేస్తుంది అని ఆశించలేం. ఎందుకంటే రేపే రంగంలోకి దిగుతున్నాడు రజిని సమకాలికుడు చిరంజీవి భోళా శంకర్ తో.. 

పంచ్ లైన్: ఈసారి కూడా ఎగరలేదు రజిని కాలర్ 

రేటింగ్: 2.25/5

Cinejosh Review: Jailer :

Jailer Telugu Movie Review

Tags:   JAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ