సినీజోష్ రివ్యూ: అన్నీ మంచి శకునములే
బ్యానర్: స్వప్న సినిమాస్
నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, షావుకారు జానకి, గౌతమి, రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్-సన్నీ కొర్రపాటి
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ
నిర్మాతలు: ప్రియాంక దత్, స్వప్న దత్
దర్శకత్వం: నందిని రెడ్డి
రిలీజ్ డేట్: 18-05-2023
వరుసగా మంచి సినిమాలు అందిస్తోన్న బ్యానర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్
నాని-దుల్కర్ అతిథులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇలా ఎన్నో మంచి శకునములతో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది అన్నీ మంచి శకునములే చిత్రం.
ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్టీవ్ గా ఉన్న ఏకైక మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తన కెరీర్ లోనే తొలిసారిగా భారీ బడ్జెట్ తో, భారీ క్యాస్టింగ్ తో మలిచిన ఈ చిత్రం ఫ్రమ్ ది ఫస్ట్ లుక్ ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ అనే ఇంప్రెషన్ పొందగలిగింది. అయితే ప్రమోషనల్ కంటెంట్ కలిగించే ఇంప్రెషన్ కంటే టోటల్ అవుట్ ఫుట్ తెచ్చే రిజల్టే ఇంపార్టెంట్ కనుక అదేంటో రివ్యూలో చూసేద్దాం.!
అన్నీ మంచి శకునములే స్టోరీ రివ్యూ:
రిషి (సంతోష్ శోభన్) సుధాకర్ ( నరేష్) కొడుకు, ఆర్య (మాళవికా నాయర్) ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) కుమార్తె. వీరిద్దరూ ఒకే రోజు పుడతారు. ఆస్పత్రిలో అనుకోని పరిస్థితుల్లో పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో పెరగాల్సిన కొడుకు రిషి.. సుధాకర్ ఇంట్లో, సుధాకర్ ఇంట్లో పెరగాల్సిన ఆర్య ప్రసాద్ ఇంట్లో పెరుగుతారు. ఓ కాఫీ ఎస్టేట్ గొడవలో ప్రసాద్ మరియు దివాకర్ (రావు రమేశ్), సుధాకర్ కుటుంబాల మధ్య కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి. అసలు పిల్లలు ఇలా మారిపోయిన విషయం తల్లిదండ్రులకు పిల్లలు మారిన విషయం తెలిసిందా? ఆ ఫామిలీస్ మధ్యలో ఉన్న కోర్టు కేసులు ఏమయ్యాయి? తమ సొంత తల్లితండ్రుల మధ్యలో పెరగాల్సిన రిషి, ఆర్య మధ్య పరిచయం ప్రేమగా మారిందా? అనేది క్లుప్తంగా అన్ని మంచి శకునములే కథ.
అన్నీ మంచి శకునములే ఎఫర్ట్స్ :
సంతోష్ శోభన్ బాయ్ నెక్స్ట్ డోర్ లుక్స్ తో ఆకట్టుకుంటూ నేచురల్ పెరఫార్మెన్స్ తో మంచి మార్కులే వేయించుకుంటున్నా సరైన ఫలితాలయితే అందడం లేదు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ వంటి సో సో రిజల్ట్స్ తోనే కెరీర్ నెట్టుకుంటూ వస్తున్న సంతోష్ శోభన్ కి బిగ్ బ్యానర్ సపోర్ట్ దొరికింది.. హ్యుజ్ క్యాస్టింగ్ అండగా నిలబడింది. నందిని రెడ్డి తనవంతు సహకారమే అందించింది. ఓవరాల్ గా మంచి శకునములతో మంచి ప్రాజెక్ట్ దక్కించుకున్న సంతోష్ శోభన్ కి మంచి రిజల్ట్ కూడా వచ్చి ఉంటే బావుండేది.
ఎలాంటి కథలోనైనా ఏ తరహా పాత్రలోనైనా ఒదిగిపోయి నటించే మాళవిక మరోసారి తన బ్రిలియెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ చాటుకుంది. సీనియర్ యాక్ట్రెస్ గౌతమి చాలా కీలకమైన పాత్రలో తన అనుభవంతో పాటుగా నటనలో పరిణతిని ప్రదర్శించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి, తన సమకాలీకుడైన నరేష్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఆ పాత్రలకు న్యాయం చేసారు అనేకంటే నిండుదనం తెచ్చారు అనడం కరెక్ట్. చాలా కాలం తర్వాత పెద్ద తెరపై తనదైన పెద్దరికాన్ని చూపించింది షావుకారు జానకి. మిగతా కేరెక్టర్స్ అన్నీ తమ పరిధిలో చేసుకుంటూపోయారు.
అన్నీ మంచి శకునములే టెక్నీషియన్స్ ఎఫర్ట్స్:
కథకి అనుగుణంగా వ్యవహరించారో.. లేక దర్శకురాలి సూచనలని పాటించారో కానీ సాంకేతిక వర్గమంతా ఆ పరిమితులకు లోబడే అవుట్ ఫుట్ అందించారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్ పెద్ద క్యాచీగా లేకపోయినా.. నేపధ్య సంగీతం మాత్రం స్మూత్ గా సాఫ్ట్ గా సాగింది. కెమేరామ్యాన్ రిచర్డ్ ప్రసాద్-సన్నీ కొర్రపాటి ఛాయాగ్రహణం హిల్స్ స్టేషన్ లోని ఛిల్ల్ నెస్ ని అంటే కూల్ గా తెరపైకి తీసుకు వచ్చింది. ఎడిటర్ జునైద్ కత్తెర మొహమాటానికి పోకుండా ఉంటే ఆన్ స్క్రీన్ అవుట్ ఫుట్ ఇంకాస్త షార్ప్ గా ఉండేదేమో!
స్వప్న సినిమాస్ బ్యానర్ అంటూ వైజయంతి మూవీస్ అశ్విని దత్ సగర్వంగా ఫీలయ్యేలా సలక్షణ సినిమాలు చేస్తూ వస్తోన్న దత్తు గారి కుమార్తెలు స్వప్న-ప్రియాంత దత్ లు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతరామం తరహాలోనే సెన్సిబుల్ సబ్జెక్టు ని సెలెక్ట్ చేసుకున్నారు కానీ.. స్క్రీన్ ప్లే విషయంలో స్ట్రిక్ట్ గా ఉండలేకపోయారు (బహుశా మహిళా దర్శకురాలనేమో).
ఇక నందిని రెడ్డి విషయానికొస్తే ఇండస్ట్రీలో అందరి నటీనటులతోను మంచి రిలేషన్ ఉన్నప్పటికీ.. కాంబినేషన్ క్రేజ్ కోసం ట్రై చెయ్యకుండా కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ వైపు వెళ్లకుండా తనదైన యూనిక్ స్టయిల్ తో ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అందించే ప్రయత్నం చేస్తూ వస్తున్న నందిని రెడ్డి ఓ మంచి పాజిటివ్ టైటిల్ తో, క్యూట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రయత్నం మంచిదే. సంస్థ గొప్పదే. తారాగణం సరైనదే. తప్పుజరిగింది మాత్రం కథనంలోనే. నీరసంగా సాగిన కథ - నిజాయితీగా చేసిన ప్రయత్నానికి అడ్డంకిగా మారింది. నందిని రెడ్డి ఆశించిన ఫలితం దక్కడానికి అవరోధంగా నిలిచింది.
అన్నీ మంచి శకునములే విశ్లేషణ:
సింపుల్ సబ్జెక్టుతో నందిని సిన్సియర్ గా చేసిన ప్రయత్నం అన్నీ మంచి శకునములే. అయితే సిన్సియారిటీ తో పాటు స్క్రీన్ ప్లే లో కాస్త స్పీడ్ కూడా ఉండి ఉంటే బాగుండేది. లీడ్ పెయిర్ చక్కగా కుదిరినా, అదర్ క్యాస్టింగ్ అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నా ఆడియన్ నిట్టూర్పులతో చూస్తున్నాడంటే కథనంలో నిదానమే కారణం. ఫీల్ గుడ్ ఫిలిం అంటే స్లో పేస్ లో ఉండాలా - కథనం నెమ్మదిగా కదిలితేనే అది ఫీల్ గుడ్ ఫిలిం అవుతుందా అనేది మేకర్స్ ఒకసారి రీ చెక్ చేసుకోవాలి. ఒక సినిమాని వేగంగా చిత్రీకరించ లేకపోవడానికి వేర్వేరు కారణాలు ఉండొచ్చు. తెరపై ఆ కథ వేగంగా కదలట్లేదు అంటే మాత్రం అది రైటింగ్ టేబుల్ అండ్ ఎడిటింగ్ టేబుల్ ఫెయిల్యూర్. ఇది రియలైజ్ అవుతారని ఆశిద్దాం. అన్నీ మంచి శకునములే ఉన్నా ఆశించిన స్పందన దక్కించుకోలేని ఈ చిత్రం ఫీల్ గుడ్ ఫిలిం మేకర్స్ అందరినీ ఎలెర్ట్ చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేద్దాం.!
సినీజోష్ రేటింగ్: 2.25/5
పంచ్ లైన్: అన్నీ మంచి శకునములే - వేగంగా సాగితే బాగుండేదిలే.!